ఫౌజీకి ప్రాణం… చివరి ఘట్టం

రాజా సాబ్ తర్వాత ప్రభాస్ నెక్స్ట్ రిలీజ్ ఫౌజీనే. స్పిరిట్ వచ్చే ఏడాది ఆల్రెడీ లాక్ చేసుకుంది కనక ఈ సంవత్సరం దసరా లేదా డిసెంబర్ కి ఫౌజీ విడుదల చేయాలనే లక్ష్యంతో దర్శకుడు హను రాగపూడి, మైత్రి మూవీ మేకర్స్ డే అండ్ నైట్ పని చేస్తోంది. మూడు యాక్షన్ ఎపిసోడ్స్ మినహా దాదాపు షూటింగ్ మొత్తం పూర్తయినట్టు సమాచారం. స్వాతంత్రం రాక ముందు భారతదేశంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ ఎమోషనల్ డ్రామా రూపొందినట్టు సమాచారం.

యూనిట్ టాక్ ప్రకారం ఫౌజీ క్లైమాక్స్ చాలా కదలించే భావోద్వేగాలతో వచ్చిందట. ముగింపు షాక్ ఇచ్చేలా ఉన్నప్పటికీ ప్రీక్వెల్ కోసం వదిలిన లీడ్ బాహుబలి రేంజ్ లో ఆసక్తి రేపుతుందని అంటున్నారు. అంటే ఫౌజీ గత జీవితంలో ఏం జరిగిందనే పాయింట్ ని రెండో భాగం కోసం హను రాఘవపూడి సిద్ధం చేస్తున్నారట. సుభాస్ చంద్రబోస్, అడాల్ఫ్ హిట్లర్ లాంటి పాత్రలని కథలో తీసుకొచ్చిన విధానం ప్యాన్ ఇండియా స్థాయిలో పేలడం ఖాయమని విశ్వసనీయ సమాచారం.

ప్రభాస్ అయితే కంటెంట్ మీద చాలా నమ్మకంగా ఉన్నాడని సన్నిహితుల మాట. రాజా సాబ్ విషయంలో పొరపాట్లు జరిగిన మాట వాస్తవమేనని, అవి మళ్ళీ రిపీట్ కాకుండా డార్లింగ్ రేంజ్ ఏంటో చూపించేలా ఫౌజీ వస్తోందని కాన్ఫిడెన్స్ చూపిస్తున్నాడట. విశాల్ చంద్రశేఖర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మీద ప్రత్యేక శ్రద్ధ వహించి పాటలు కూడా బెస్ట్ ఇచ్చారని టాక్. ప్రభాస్ కు చాలా కాలంగా అదిరిపోయే మ్యూజికల్ ఆల్బమ్ పడలేదు.

సలార్ లాగే ఫౌజీలో కూడా డాన్సులు చేసే డ్యూయెట్లు ఉండవు. సందర్భానికి తగినట్టు పాటలతో పాటు ప్రభాస్, ఇమాన్వి మధ్య ప్యూర్ లవ్ సాంగ్స్ ఉంటాయట. రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటించాలనే దాని మీద మైత్రి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ సంవత్సరమే థియేటర్లకు తీసుకురావాలనే సంకల్పమైతే బలంగా ఉంది. సైనికుడిగా ప్రేమికుడుగా ప్రభాస్ ఇప్పటిదాకా పోషించని రెండు షేడ్స్ ఫౌజీలో చూడొచ్చు. కాకపోతే కొంచెం వెయిట్ చేయక తప్పదు.