ఎల్లుండి విడుదల కాబోతున్న గోదారి గట్టుపైన సినిమా కోసం హీరో సుమంత్ ప్రభాస్ ఫుల్ ప్రమోషన్లు చేస్తున్నాడు. ఒకపక్క ఇంటర్వ్యూలు ఇస్తూ ఇంకోవైపు క్రియేటివ్ గా కొన్ని యాడ్స్ చేయించి వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేయించే పనిలో ఉన్నాడు. వేసవి తాపంలో ఏసీలు, కూలర్లు, కొబ్బరి బొండాలు దండగని మా సినిమా చూస్తే చాలు సమ్మర్ చిల్ అయిపోతుందనే తరహాలో ఏఐ టెక్నాలజీతో పాటు మనుషులను వాడి కొన్ని వీడియోలు వదిలాడు.
బాగానే ఉంది కానీ ఈ వేసవి ప్రమోషన్లు ఆశించిన స్థాయిలో బజ్ తేవడం లేదనిపిస్తోంది. ఇంకో రెండు రోజులు మాత్రమే టైం ఉంది. ఓపెనింగ్స్ రావాలంటే హైప్ పెరగాలి. కంటెంట్ మీద ఎంత నమ్మకమున్నా ముందైతే మొదటి రోజు వచ్చే ప్రేక్షకులను పోగేసుకోవాలి. అసలే మేం ఫేమస్ తర్వాత సుమంత్ ప్రభాస్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. గోదారి గట్టుపైన కూడా వేగంగా పూర్తయ్యింది కాదు. ఏవేవో కారణాల వల్ల ఏడాదిన్నర పట్టింది.
ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది. అందులో ఏమైనా చమక్కులు మెరుపులు ఉంటాయేమో చూడాలి. బాక్సాఫీస్ వద్ద పరిస్థితి ఏ మాత్రం బాలేదు. ఐసీయూలో ఉన్న రోగిలా థియేటర్లు బిక్కుబిక్కు మంటున్నాయి. కొన్ని బిసి సెంటర్స్ లో సింగల్ స్క్రీన్లు మూసేసి జూన్ లో పెద్ది వచ్చినప్పుడే తీయాలని నిర్ణయించుకున్నారట. కనీసం కరెంటు బిల్లులు, జీతాలు కూడా చెల్లించలేని కలెక్షన్లు రానప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు.
సో గోదారి గట్టుపైన ఏదో ఒక మేజిక్ చేయాలి. జనాన్ని మళ్ళీ థియేటర్లకు వచ్చేలా చేయాలి. కాంపిటీషన్ తో పెద్ద సమస్య లేదు. అపోజిషన్ లో ఉన్నవాటికి దీనికి ఉన్నంత బజ్ కూడా లేదు. తండ్రి కూతుళ్ళ ఎమోషన్ కి ఒక ఆటో డ్రైవర్ ప్రేమకథని ముడిపెట్టిన దర్శకుడు సుభాష్ చంద్ర తన సక్సెస్ మీద ధీమాగా ఉన్నాడు. మహేష్ బాబు రాజకుమారుడు పాటలోని లైనుని టైటిల్ గా పెట్టుకున్న ఈ లవ్ మూవీ ఏ మేరకు మెప్పిస్తుందో ఇంకో నలభై ఎనిమిది గంటల్లో తేలనుంది.
This post was last modified on May 6, 2026 11:37 am
ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…
దానం నాగేందర్‌పై వేటు పడడం.. ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావడం.. ఇటీవల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…
శ్రీకాంత్ ఓదెల.. ఈ పేరు చెప్పగానే అందరికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…
నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…
నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…
వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…