టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత నోట నుంచి వచ్చే మాటలు ఎప్పటికప్పుడు వైరల్ గా మారుతూ ఉంటాయి. అంతేకాకుండా ఆయా వర్గాలకు చెందిన వారిని ఎప్పటికప్పుడు ఆమె షాక్ లకు గురి చేస్తూ ఉంటారు. తాజాగా ఆమె తీసుకున్న ఓ నిర్ణయం పార్టీలతో సంబంధం లేకుండా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలకు భారీ షాక్ ఇస్తూ ఆమె ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. వాహనాలు నడిపే సమయంలో ట్రాఫిక్ రూల్స్ పాటించని నేతలకు సాధారణ జరిమానాలకు బదులుగా రెట్టింపు జరిమానాలు విధించాలని ఆమె ఆదేశాలు జారీ చేశారు.
అనకాపల్లి జిల్లాలో మంగళవారం ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వినియోగంపై ఓ అవగాహన ర్యాలీ జరిగింది. నక్కపల్లి పరిధిలో జరిగిన ఈ ర్యాలీలో హోం మంత్రి హోదాలో అనిత స్వయంగా పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై నమోదు అవుతున్న కేసుల్లో రాజకీయ నేతల జోక్యం అదికంగా ఉంటోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ రూల్స్ వాయిలేషన్ కేసులకు సంబంధించి ఇకపై ఎంత పెద్ద రాజకీయ నేత ఫోన్ చేసినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆమె పోలీసు అధికారులకు సూచించారు.
ఇక రాజకీయ నేతలే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే ఎలా అనే అంశం కూడా ఈ సందర్భంగా చర్చకు రాగా.. దానిపై అనిత తనదైన శైలిలో స్పందించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన సందర్భాల్లో సామాన్యులకు జరిమానాలు విధించడం సరైనదేనని చెప్పిన అనిత… ఈ ఉల్లంఘనలకు రాజకీయ నేతలు పాల్పడితే..వారిపై డబుల్ ఫైన్ లు విధించాలని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. నేతలు సామాన్య జనానికి ఆదర్శంగా నిలబడాలన్న మాటను గట్టిగానే పలికిన అనిత… ట్రాఫిక్ నిబంధనలను నేతలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. లేని పక్షంలో వారికి రెట్టింపు జరిమానాలు తప్పవన్నారు. ఈ విషయంలో ఏ పార్టీ వారన్న అంశాన్ని చూడకుండా వ్యవహరించాలని ఆమె పోలీసు అధికారులకు సూచించారు.
This post was last modified on May 6, 2026 10:13 am
ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…
దానం నాగేందర్‌పై వేటు పడడం.. ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావడం.. ఇటీవల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…
శ్రీకాంత్ ఓదెల.. ఈ పేరు చెప్పగానే అందరికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…
నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…
నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…
వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…