Movie News

టబు పాత్రను హీరో తగ్గించాడా?

బాలీవుడ్లో బలమైన ముద్ర వేసిన దక్షిణాది దర్శకుల్లో ప్రియదర్శన్ ఒకరు. ఆయన అక్కడ ఎన్నో కామెడీ సినిమాలు తీసి హిట్లు కొట్టారు. తన సొంత భాష మలయాళంలో మోహన్ లాల్ లాగే బాలీవుడ్లోనూ ప్రియదర్శన్‌కు ఒక ఫేవరెట్ హీరో ఉన్నారు. అతనే.. అక్షయ్ కుమార్. వీరి కలయికలో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. తాజాగా ఈ కాంబినేషన్లో తెరకెక్కిన ‘భూత్ బంగ్లా’ కూడా మంచి ఫలితాన్నే అందుకుంది.

ఈ చిత్రానికి అంత మంచి టాక్, రివ్యూలేమీ రాలేదు. కానీ ఇందులో వినోదం నచ్చి ప్రేక్షకులు బాగానే చూస్తున్నారు. ఇప్పటికే ‘భూత్ బంగ్లా’ రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమా సక్సెస్ ఆనందంలో ఉన్న టీంకు.. మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక ప్రచారం ఇబ్బందికరంగా మారింది.

ఈ చిత్రంలో సీనియర్ నటి టబు ఓ ముఖ్య పాత్రలో నటించగా.. ఆమె పాత్ర నిడివి, ప్రాధాన్యం తక్కువగా ఉందని.. కావాలనే ఆమె మీద తీసిన కొన్ని సీన్లను ఎడిటింగ్‌లో లేపేశారని.. ఇదంతా అక్షయ్ కుమారే పనిగట్టుకుని చేశారని ఒక ప్రచారం నడుస్తోంది.

తనను టబు సినిమాలో డామినేట్ చేసేలా ఉందనే అక్షయ్.. తన మిత్రుడైన ప్రియదర్శన్‌తో కలిసి ఆమె సీన్లను కత్తిరించాడంటూ మీడియాలో, సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై ప్రియదర్శన్ స్పందించాడు. ఈ ప్రచారాన్ని ఖండించాడు.

‘‘మా సినిమా విజయాన్ని తట్టుకోలేక కొందరు కావాలనే నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు. టబు ‘భూత్ బంగ్లా’ విషయంలో ఎంతమాత్రం అసంతృప్తితో లేరు. నేను ఆమెతో ఎనిమిది సినిమాలు చేశాను. మా మధ్య మంచి అనుబంధం ఉంది. టబుకు ఏదైనా సమస్య ఉంటే నాతో నేరుగా మాట్లాడుతుంది.

ఆమె మీద షూట్ చేసిన ప్రతి సన్నివేశాన్నీ సినిమాలో పెట్టాం. ఏదీ కట్ చేయలేదు. నిజానికి సినిమాలో ఏదైనా తీసేయాలంటే అది నిర్ణయించేది దర్శకుడినైన నేను. అక్షయ్ ఎప్పుడూ ఎడిటింగ్‌లో జోక్యం చేసుకోడు. సినిమా విడుదలకు ముందు మెయిన్ ఆర్టిస్టులందరూ ప్రివ్యూ చూశారు. ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేస్తున్న వాళ్లు సిగ్గుపడాలి’’ అని ప్రియదర్శన్ ఫైర్ అయ్యారు.

This post was last modified on May 2, 2026 8:15 pm

Share

Recent Posts

టాలీవుడ్ స్టార్లు ఆ మాయలో పడి నష్టపోతున్నారా

మన టాలీవుడ్ స్టార్లు ఇప్పుడు లోకల్ మార్కెట్ ను దాటేసి అంతకుమించి అనేలా అడుగులు వేస్తున్నారు. నార్త్ ఆడియన్స్ తో…

3 hours ago

అబ్బవరం ఈసారి బయటపడగలడా?

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నుంచి ఒక టైంలో వచ్చిన సినిమాలు చూస్తే.. తన పనైపోయిందనే అనిపించింది. ఐతే కెరీర్…

4 hours ago

అసలు ఈ మస్క్ వివాదం ఏంటి?

గ‌త రెండు రోజులుగా ఇటు సోష‌ల్ మీడియాలోను, అటు ప్ర‌ధాన మీడియా ఛానెళ్ల‌లోను.. తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం.. ప్ర‌పంచ…

9 hours ago

బడ్జెట్ రూ. 2 కోట్లు కలెక్షన్లు 50 కోట్లు…

పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…

10 hours ago

కొడతావా… కొట్టుకో

ఎన్నికల కమిషన్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు చేస్తున్న ఆందోళనతో దేశ…

10 hours ago

కమల్ కోసం రజినీ త్యాగం?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…

13 hours ago