Movie News

సత్య ఇంకొంచెం శ్రద్ధ పెడితే

జెట్లీ ఫలితం ఏమైందనేది కాసేపు పక్కనపెడితే కమెడియన్ సత్య క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఏంటో నిన్న ఓపెనింగ్స్ తో అర్థమయ్యింది. భీభత్సమైన హౌస్ ఫుల్స్ తో కలెక్షన్లు రాలేదు కానీ ఉన్నంతలో మెయిన్ సెంటర్లలో యాభై శాతం అంతకన్నా ఎక్కువ ఆక్యుపెన్సీలు కనిపించాయంటే దానికి కారణం సత్య మీద జనాలకున్న నమ్మకమే. ఆశ్చర్యంగా కొన్ని కేంద్రాల్లో గాయపడ్డ సింహం కన్నా జెట్లీ బుకింగ్స్ ఎక్కువగా ఉన్నాయి. బుక్ మై షోలోనూ రెండింటి మధ్య చెప్పుకోదగ్గ వ్యత్యాసం ఉంది.

ఇకపై కేవలం హీరోగా కొనసాగడం సత్యకు సాధ్యం కాకపోవచ్చు. కాకపోతే కొంత కాలం సోలో హీరోగా మార్కెట్ ఎంజాయ్ చేద్దామనుకుంటే సరైన హిట్టు ఒకటి పడాలి. జెట్లీలో ఉన్న లోపాలు ఆ కోరికను పూర్తిగా నెరవేర్చేలా లేవు. ఒక వర్గం ఆడియన్స్ ని కొంత మేర మెప్పించినా అందరినీ కన్విన్స్ చేయడంలో దర్శకుడు రితేష్ రానా సక్సెస్ కాలేదు. కీలకమైన వీకెండ్ ముందున్న నేపథ్యంలో టీమ్ సక్సెస్ ప్రెస్ మీట్ పెట్టి తమ ఆనందాన్ని పంచుకుంది. ఇదేమైనా హెల్ప్ అవుతుందేమో చూడాలి.

రాబోయే రోజుల్లో కేవలం తన మీద నడిచే కథలను ఎంచుకునే విషయంలో సత్య జాగ్రత్త వహించక తప్పదు. రంగబలి ఫేమ్ పవన్ దర్శకత్వంలో ఇటీవలే ఒక సినిమాకు సైన్ చేశాడు. అందులో కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్రధారి. తర్వాత ఇంపార్టెన్స్ సత్యకు ఉంటుంది. ఎలాగూ తమిళ డబ్బింగ్ అవుతుంది కాబట్టి కంటెంట్ కనక జనాలకు నచ్చితే ఇతర భాషల్లోనూ పాపులారిటీ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది.

ప్రస్తుతానికి జెట్లీ చాలా నెమ్మదిగా మొదలయ్యింది కనక సోమవారానికి ఏ పొజిషన్ లో ఉంటుందనేది క్లారిటీ వస్తుంది. ఒకవేళ యునానిమస్ అనిపించుకుంటే సీన్ వేరుగా ఉండేది. సెన్సేషనల్ కలెక్షన్స్ అంటూ సోషల్ మీడియా హోరెత్తిపోయేది. ఇదే సత్యతో జెట్లీ లాంటి విమానం కథ కాకుండా బయట సిటీలో నడిచే ఎంటర్ టైనర్ తీసి ఉంటే బాగుండేదనే కామెంట్లో నిజం లేకపోలేదు. అన్నట్టు జెట్లీ సీక్వెల్ 2030 అని చివర్లో చెప్పారు. అది ఉంటుందో లేదో అని సత్యతోనే డైలాగు చెప్పించడం కొసమెరుపు.

This post was last modified on May 2, 2026 2:58 pm

Share

Recent Posts

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

1 hour ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

1 hour ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

1 hour ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

2 hours ago

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

5 hours ago

అంతా బానే ఉన్నట్టుగా వైసీపీ ప్రచారం

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యం మాట ఎలా ఉన్నా.. నాయ‌కుల‌ను బ‌లోపేతం చేసేందుకు.. వారిని కొంత ఉత్తేజ ప‌రిచేందుకు…

5 hours ago