దాన్ని సుకుమార్ గారు ఇచ్చారు. రామ్ చరణ్ ఇప్పటిదాకా ఇవ్వని కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇందులో చూడొచ్చని, ఇంకా చెప్పాలంటే రంగస్థలంని మించి ఉంటుందని, అంత బాగా చరణ్ అదరగొట్టాడని ఓ రేంజ్ లో పొగడ్తల వర్షం కురిపించారు. తన కెరీర్ బెస్ట్ చిట్టిబాబుని ఈ పెద్ది గాడు నిజంగానే కొట్టగలడేమో చూడాలి.
ఫోన్ లో రైరా సాంగ్ చూడటం కన్నా ఇక్కడ బిగ్ స్క్రీన్ మీద చూస్తుంటే వేరే లెవెల్ ఉందని, అసలు ఆ స్పీడ్ ని మ్యాచ్ చేయడం మెదడు వల్ల కావడం లేదని చరణ్ డాన్సుల గురించి తెగ మెచ్చుకున్నారు.
మొత్తానికి మెగాభిమానులు ఎదురు చూస్తున్న ప్రకటన అయితే వచ్చేసింది. సరిగ్గా ఇంకో ముప్పై రెండు రోజుల్లో ప్రీమియర్లు పడిపోతాయి. షూటింగ్ నిన్నటితో గుమ్మడికాయ కొట్టేశారు. ఏఆర్ రెహమాన్ రీ రికార్డింగ్ కోసం పది రోజులకు పైగా కేటాయించవచ్చని సమాచారం. అది కాగానే పోస్ట్ ప్రొడక్షన్ ని కొలిక్కి తెచ్చేసి మే నాలుగో వారం మొదట్లోనే సెన్సార్ పూర్తి చేసేలా టార్గెట్ పెట్టుకున్నారు. ఓవర్సీస్ ఆలస్యం జరగకుండా చాలా జాగ్రత్తలైతే తీసుకోవాల్సి ఉంటుంది.
ఇక ఇప్పటి నుంచి నాన్ స్టాప్ ప్రమోషన్లకు తెర తీయబోతున్నారు. విడుదల తేదీ పక్కా కావడంతో థియేటర్ అగ్రిమెంట్లు ఊపందుకోబోతున్నాయి. పోటీ పెద్దగా లేదు కాబట్టి రామ్ చరణ్ కు సోలో రన్ దక్కనుంది. ఏపీ తెలంగాణలో అత్యధిక థియేటర్లలో పెద్దిని దింపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్నీ సవ్యంగా జరిగి టాక్ కనక పాజిటివ్ వస్తే తెలుగు రాష్ట్రాల వరకు పుష్ప 2 రికార్డులను ఈజీగా టార్గెట్ చేయొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates