90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ తో వెబ్ సిరీస్ బ్లాక్ బస్టర్ అందుకున్న తెలుగు దర్శకుడిగా ఆదిత్య హాసన్ కు చాలా పేరు వచ్చింది. లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ ఆయన కాకపోయినా వెనుక ఉండి నడిపించిన నిర్మాత కం షో రన్నర్ గా అది కూడా ఎంత విజయం అందుకుందో చెప్పనక్కర్లేదు. సిల్వర్ స్క్రీన్ డెబ్యూ కోసం ఎదురు చూస్తున్న ఆదిత్య హాసన్ ‘ఎపిక్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బేబీ జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ లో టీజర్ లాంచ్ జరిగింది. కాన్సెప్ట్ ఏంటో చెప్పేశారు. ఉన్నత చదువుల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి యుకె వెళ్లిన ఆదిత్య (విజయ్ దేవరకొండ), కడలి (వైష్ణవి చైతన్య) ప్రేమలో పడతారు. బాగా దగ్గరయ్యేంతగా ప్రేమించుకుంటారు. ఇదంతా ఇండియాలో ఉన్న తల్లితండ్రులకు (శివాజీ-వాసుకి) తెలియదు. కొడుకు గొప్పగా చదువుతున్నాడనే లెక్కలో ఉంటారు. ఇంతకీ ఎపిక్ అంటే ఏంటి, ఫస్ట్ సెమిస్టరు అనే ఉపశీర్షిక ఎందుకు పెట్టారనేది సినిమాలో చూడాలి.
ఈసారి ఆదిత్య హాసన్ ట్రెండ్ కు తగ్గట్టు రొమాన్స్ కాస్త ఘాటుగానే రాసుకున్నారు. లీడ్ పెయిర్ మధ్య లిప్ లాక్ సీన్లు, బెడ్ రూమ్ లో రొమాన్స్ చూస్తుంటే యూత్ ని కాస్త ఎక్కువే టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. ఇలాంటివి యూత్ కి ఫాస్ట్ గా కనెక్ట్ అయిపోతారనే ఉద్దేశం కాబోలు. షూటింగ్ మొత్తం దాదాపు యుకె రియల్ లొకేషన్స్ లోనే షూట్ చేశారు. కొంత భాగం మాత్రమే మన దేశంలో జరుగుతోంది. హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం సమకూర్చారు.
సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ కావడంతో ప్రొడక్షన్ వేల్యూస్ రిచ్ గానే ఉన్నాయి. ఇది టీజర్ కాబట్టి కథ పూర్తిగా చెప్పలేదు కానీ యూత్ ఫుల్ ఎలిమెంట్స్ అయితే పుష్కలంగా ఉన్న హింట్ ఇచ్చారు. విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు. ఈ వేసవిలోనే విడుదల చేయబోతున్నారు. బేబీ తర్వాత గం గం గణేశా రూపంలో ఫ్లాపు చవి చూసిన ఆనంద్ కొంచెం గ్యాప్ ఎక్కువ తీసుకున్నారు. ఇది ఫస్ట్ సెమిస్టరు అన్నారు కాబట్టి హిట్ అయితే ఎపిక్ రెండో భాగం కూడా వచ్చేలా ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates