Movie News

ఇంట ఓడినా రచ్చ గెలుస్తున్న ఉస్తాద్

ఓజి హ్యాంగోవర్ గత ఏడాది బాగా ఎంజాయ్ చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులను ఉస్తాద్ భగత్ సింగ్ దారుణంగా నిరాశ పరచకపోయినా రొటీన్ కంటెంట్ తో ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా ఫెయిలయ్యింది. కంటెంట్ అంతంత మాత్రంగా ఉండటం ఒక దెబ్బ అనుకుంటే పోటీలో ఉన్న దురంధర్ ది రివెంజ్ స్ట్రోక్ గట్టిగా తగలడంతో కోలుకునే అవకాశం లేకుండా పోయింది. కేవలం నెల రోజుల లోపే నెట్ ఫ్లిక్స్ ఓటిటిలోకి వచ్చేయడం అందరూ ఊహించిందే.

అయితే థియేటర్లు అంటే ఇంటి దగ్గర ఓడిపోయిన ఉస్తాద్ భగత్ సింగ్ రచ్చ గెలుస్తున్నాడని డిజిటల్ వర్గాల కథనం. రెండు వారాలకు గాను 10.9 మిలియన్ వ్యూ అవర్స్ (వీక్షించిన గంటలు) సాధించి 2026 సంవత్సరానికి నెంబర్ వన్ ఇండియన్ మూవీగా ఆల్రెడీ కొత్త మైలురాయి స్థాపించాడట. ఎంత మంది చూసారనే వ్యూస్ లెక్కలు తీసుకుంటే అవి 4.4 మిలియన్లు ఉంటారని సమాచారం. ఎలా చూసుకున్నా ఒక డిజాస్టర్ మూవీకి ఇది పెద్ద నెంబర్.

ఇంకా రన్ ఉంటుంది కాబట్టి నెల రోజుల తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ ఎక్కడ ఆగుతుందో చూడాలి. ఇంత రెస్పాన్స్ రావడానికి కారణం లేకపోలేదు. ఫ్లాప్ టాక్ వల్ల తెలుగు ఆడియన్స్ చాలా మంది థియేటర్స్ కు వెళ్ళలేదు. ఇతర భాషల్లో డబ్బింగ్ చేయడం వల్ల వ్యూస్ మరింత పెరిగే అవకాశం దొరికింది. నెట్ ఫ్లిక్స్ ఈ మధ్య అనువాదం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అది ప్లస్ అయ్యిందని విశ్లేషకులు అంటున్నారు.

సరే వినడానికి ఇదంతా బాగానే ఉంది కానీ కేవలం డిజిటల్ వ్యూస్ ఆధారంగా ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడేదో హిట్ సినిమా అయిపోదు. ఎందుకంటే ఇంట్లో చూసే సౌలభ్యం ఉండటం వల్ల బాక్సాఫీస్ వద్ద దారుణంగా పోయిన సినిమాలు ఓటిటిలో బాగా పే చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మొన్న ఏడాది ఒక పెద్ద హీరో ఫ్లాప్ మూవీ ఓటిటిలో పే పర్ వ్యూ మోడల్ లో పెడితే 12 కోట్లు వసూలు చేసింది. అందుకే నిర్మాతలు ఓటిటి విషయంలో అంత పట్టుగా ఉండేది.

This post was last modified on April 29, 2026 4:57 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

1 hour ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

4 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

4 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

4 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

4 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

5 hours ago