Movie News

దర్శకత్వంపై హీరో పునరాలోచన?

కెరీర్లో పడుతూ లేస్తూ సాగుతూనే తనకంటూ ఒక గుర్తింపు, మార్కెట్ సంపాదించుకున్నాడు యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం. ‘రూల్స్ రంజన్’ సినిమా వచ్చే టైంకి అతడి కెరీర్ అయిపోయిందని అంతా అనుకున్నా.. ‘క’ సినిమాతో బలంగా పుంజుకున్నాడు. తర్వాత ‘దిల్ రుబా’ దెబ్బ కొట్టినా.. ‘కే ర్యాంప్’ చిత్రంతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు.

ఆ తర్వాత కిరణ్ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ‘బేబీ’ మేకర్స్‌తో ‘చెన్నై లవ్ స్టోరి’ లాంటి క్రేజీ మూవీని లైన్లో పెట్టాడు. దీనిపై మంచి అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటే.. కిరణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచే అవకాశముంది.

మరోవైపు అమేజాన్ ప్రైమ్ కోసం ‘డియర్ కామ్రేడ్’ దర్శకుడు భరత్ కమ్మతో ‘గువ్వలచెరువు ఘాట్’ అనే సిరీస్ కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇంకోవైపు సుకుమార్ శిష్యుడైన వీర కోగటంతో కిరణ్ చేయబోతున్న థ్రిల్లర్ ఫిలింకి కూడా మంచి బజ్ క్రియేట్ అయింది. ఐతే ఇవన్నీ కాక, స్వీయ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి కిరణ్ ప్లాన్ చేసుకున్నాడు. దానికి ‘రియాలిటీ’ అనే టైటిల్ అనుకున్నాడు. ఇందులో కిరణే హీరో కాగా.. ఓ కీలక పాత్ర కోసం అరవింద్ స్వామిని తీసుకోవాలని అనుకున్నాడు.

‘చెన్నై లవ్ స్టోరి’ తర్వాత వేరే సినిమా మొదలుపెట్టడానికి ముందు తన డైరెక్షన్లో చేసే సినిమాను మొదలుపెట్టాలనుకున్నాడు కిరణ్. కానీ ఇప్పుడు ఆ ఆలోచన నుంచి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. మంచి లైనప్ ఉన్న టైంలో డైరెక్షన్‌ అన్నది సరైన నిర్ణయం కాదని అతను ఆలోచిస్తున్నాడట.

ఇంత బిజీగా ఉంటూ డైరెక్షన్ మీద దృష్టిపెట్టడం అంత తేలిక కాదు. కెరీర్ బాగున్న టైంలో హీరోలు దర్శకత్వం చేసి చేతులు కాల్చుకున్న ఉదాహరణలు చాలానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ‘జానీ’ ఇందుకు పెద్ద ఎగ్జాంపుల్.

యువ కథానాయకులకు రైటింగ్, టేకింగ్ విషయంలో ప్రతిభ ఉంటే.. తమ సినిమాల స్క్రిప్టులను దగ్గరుండి చూసుకోవడం, మేకింగ్‌లోనూ ఇన్వాల్వ్ అవ్వడం వరకు ఓకే కానీ.. దర్శకత్వం అన్నది తేలికైన విషయం కాదు. తెలివైన నిర్ణయమూ కాదు.

యువ కథానాయకుల్లో అడివి శేష్, విశ్వక్సేన్ సైతం దర్శకత్వంలో ఫెయిలైన వాళ్లే. అందుకే కిరణ్ ఈ దశలో దర్శకత్వం చేయడం కరెక్టా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అతను కూడా ఇదే ఆలోచనతో ప్రస్తుతానికి తన డైరెక్షన్ మూవీని హోల్డ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది.

This post was last modified on April 29, 2026 3:38 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

2 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

4 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

5 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

5 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

5 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

6 hours ago