Movie News

రెండో వాలా ఇక్కడెందుకు తేడా కొట్టింది

మలయాళంలోనే కాదు ఇతర భాషల్లో హాట్ టాపిక్ గా మారిన సినిమా వాలా 2. చాలా తక్కువ బడ్జెట్ లో రూపొంది మూడు వారాలు తిరక్కుండానే రెండు వందల కోట్లు వసూలు చేయడం గురించి అందరూ ఆసక్తికరంగా మాట్లాడుకున్నారు. ఒరిజినల్ వెర్షన్ నిర్మాతల్లో ఒకరైన సాహూ గారపాటి ఆఘమేఘాల మీద డబ్బింగ్ చేయించి కొంచెం లేట్ గా రిలీజ్ చేశారు. నిఖిల్, సాయి దుర్గ తేజ్ లాంటి హీరోలను తీసుకొచ్చి ఈవెంట్లో నాలుగు మంచి మాటలు చెప్పించుకున్నారు.

ఇంత చేస్తే వాలా 2 ఏపీ తెలంగాణలో మేజిక్ చేయడం లేదు. ఓపెనింగ్ చాలా నెమ్మదిగా మొదలై వీకెండ్ లోనూ ఏమంత గ్రోత్ చూపించలేదు. హైదరాబాద్ మల్టీప్లెక్సుల్లో జనాలు కనిపించారు కానీ కిందిస్థాయి సెంటర్లలో ఆక్యుపెన్సీలు మరీ తీసికట్టుగా ఉన్నాయి. కారణాలు లేకపోలేదు. మొదటిది వాలా 2కి సరైన ప్రమోషన్స్ చేయలేదు. పబ్లిసిటీకి టైం లేకపోవడంతో హడావిడిగా ప్రచారాన్ని చుట్టేశారు. ఇది జనాలకు రిజిస్టర్ కాకుండా చేసింది.

మరో ముఖ్యమైన రీజన్ దీన్ని వాలా 2 అన్నారు సంతోషం. అసలు వాలా 1 ఎప్పుడు వచ్చింది, ఏ ఓటిటిలో ఉందనే విషయం మన ప్రేక్షకులు తెలియకపోవడం. అనువాదమే కానిది ఎక్కడైనా ఎందుకు దొరుకుతుంది. పైగా టైటిల్ వాలా 2 అని అర్థం కాకుండా పెడితే ఆడియన్స్ కి లింకు కాదు. ఏదో ‘దోస్తీ’ అనో లేదా ‘ఫ్రెండ్స్ గ్యాంగ్’ అనో పెడితే కనీసం యూత్ ఎక్కువగా వచ్చేవాళ్ళు. మలయాళ పేరుని యధాతథంగా వాడుకోవడం మైనస్ అయ్యింది.

ఎండలు, ఐపీఎల్ ప్రభావం చూపిస్తున్న మాట వాస్తవమే కానీ జనాలు పూర్తిగా థియేటర్లకు దూరం అయ్యారనే మాట అబద్దం. ఎందుకంటే డార్లింగ్ ని ఇంత సమ్మర్ లోనూ రికార్డు కలెక్షన్లతో ఆదరిస్తున్నారుగా. పదహారు సంవత్సరాల పాత సినిమా ఇంత కలెక్ట్ చేసినప్పుడు కొత్త రిలీజులు ఇంకెంత చేయాలి. సో వాలా 2 ఇక్కడ దెబ్బ తిన్నడానికి రకరకాల నేపధ్యాలున్నాయి. కొంత నేటివిటీ ఫాక్టర్ కూడా వాలా 2 కనెక్టివిటీని తగ్గించిందని చెప్పాలి. కేరళలో మాత్రం ఇంకా దూసుకెళ్తూనే ఉంది.

This post was last modified on April 27, 2026 5:30 pm

Share

Recent Posts

నంది అవార్డులు వచ్చేస్తున్నాయహో…

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం ప్రకటించే నంది అవార్డుల‌కు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డుల‌తో స‌మానంగా చూసేవారు.…

1 hour ago

వందేమాత‌రంపై కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్‌?

జాతీయ గేయం వందేమాత‌రం వ్య‌వ‌హారంపై జ‌రుగుతున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. దేశానికి స్వాతంత్రం రాక మునుపు నుంచి ఈ…

2 hours ago

కలెక్షన్ కింగ్ అందుకే వెనుక ఉన్నారా

ఒకప్పుడు కలెక్షన్ కింగ్ గా తొంభై దశకంలో స్టార్ హీరోలకు బలమైన పోటీ ఇచ్చిన మోహన్ బాబుకి ఇప్పటికీ ఫాలోయింగ్…

4 hours ago

జడల్ జమానాకు సెన్సార్ ట్విస్టులు

ప్యారడైజ్ సెన్సార్ అయిపోయింది. ఊహించినట్టే ఏ సర్టిఫికెట్ వచ్చింది. 2 గంటల 54 నిమిషాల సవారి జాతి ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు…

4 hours ago

ఇక పిఠాపురంలోనే పవన్ మకాం?

చాలా రోజుల తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనిపించారు. ప్రకృతి వైద్యం కోసం కేరళం వెళ్లి 20 రోజుల…

4 hours ago

టీమిండియాకు చెమటలు పట్టించిన జపాన్

జపాన్‌తో మ్యాచ్ అంటే టీమిండియా సులభంగా గెలుస్తుందని అనుకున్నారు క్రికెట్ ఫ్యాన్స్. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తడి…

5 hours ago