Movie News

ఆషు రెడ్డి ప్రెస్ మీట్.. ఏం చెప్పబోతోంది?

సినీ నటి ఆషు రెడ్డి పేరు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో మార్మోగి పోతుంది. పెళ్లి పేరుతో దాదాపు పది కోట్ల రూపాయలకు ధర్మేంద్ర అనే వ్యక్తిని మోసం చేసినట్లు ఆమె ఆరోపణలు ఎదుర్కొంటుండడం.. ఆషురెడ్డితో పాటు ఆమె కుటుంబంపై నాన్ బెయిలబుల్ కేస్ నమోదు కావడమే ఇందుకు కారణం. లండన్లో ఉండే ధర్మేంద్ర అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఆషు ఐదు కేజీల బంగారాన్ని కొనిపించుకున్నట్టు సమాచారం.

అంతేకాక తన నివాసం కోసం ఫ్లాట్ కావాలని చెప్పి మూడు కోట్ల ఖరీదైన విల్లాకు సైతం ధర్మేంద్ర నుండి ఆషు రెడ్డి అడ్వాన్స్ కూడా తీసుకుదట. తమ పెళ్లి కోసం గతంలో ధర్మేంద్రతో కలిసి వేణుస్వామితో జాతకాలు చెప్పించుకోవడంతో పాటు ప్రత్యేక పూజలు కూడా చేయించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తనతో పెళ్లికి ఆషు సిద్ధం కావడంతో ఆమె ఎంత అడిగితే అంత డబ్బులు పంపుతూ వచ్చాడట ధర్మేంద్ర. దీనికి సంబంధించిన బ్యాంకు లావాదేవీల వివరాలను ధర్మేంద్ర తండ్రి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఐతే ధర్మేంద్ర నుంచి భారీగా డబ్బులు తీసుకుని, బంగారం కూడా కొనిపించుకున్న ఆషు హఠాత్తుగా తనతో పెళ్లిని క్యాన్సిల్ చేసిందట.

దీంతో తన డబ్బులు తనకు ఇచ్చేయమని అతను డిమాండ్ చేస్తే.. మళ్ళీ పెళ్ళికి సరే అందట. కానీ తర్వాత రెండోసారి పెళ్లి విషయంలో ఆషు మోసం చేసినట్లు ధర్మేంద్ర, అతడి తండ్రి ఆరోపిస్తున్నారు. ఆషు మోసం విలువ రూ.9.83 కోట్ల. ఆషు సోదరి దివ్యా రెడ్డికి సైతం ధర్మేంద్ర 50 లక్షలు ఇచ్చాడట.వివిధ కారణాలు చెప్పి తమ కుమారుడిని హనీ ట్రాప్ చేసి ఇలా మోసం చేస్తున్నారని ధర్మేంద్ర తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు ఆషు రెడ్డి, ఆమె కుటుంబసభ్యులపై సిసిఎస్ పోలీసులు కేస్ నమోదు చేశారు. కాగా ఈ ఆరోపణలను ఆషు సోషల్ మీడియాలో ఖండించింది. తప్పుడు వార్తలు లీగల్ యాక్షన్ తీసుకుంటానని ఆమె హెచ్చరించింది. అంతకు మించి వివరణ ఏమి ఇవ్వని ఆమె.. ఈ కేసు విషయమై ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్లు తెలిసింది.

ఆదివారం ఆమె దేవాలయాల దర్శనంలో ఉంది. రాత్రి హైదరాబాద్ వచ్చింది. ఆమె తండ్రి కూడా వైజాగ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. వీళ్లిద్దరూ కలిసి ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నారట. మరి ఈ ఆరోపణలపై అషురెడ్డి వెర్షన్ ఏంటో చూడాలి.

This post was last modified on April 27, 2026 12:43 pm

Share

Recent Posts

విజయ్ తో చంద్రబాబు ఏం చర్చించారు?

తమిళనాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్‌.. మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చారు. తొలుత క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్న ఆయ‌న‌.. అనంత‌రం..…

10 minutes ago

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

2 hours ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

2 hours ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

2 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

3 hours ago

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

6 hours ago