తమిళనాట ఇప్పుడు సినిమా చర్చలన్నీ ‘మాస్టర్’ చుట్టూనే తిరుగుతున్నాయి. కరోనా-లాక్ డౌన్ దెబ్బకు కుదేలైన కోలీవుడ్.. ఈ సినిమా మీద చాలా ఆశలే పెట్టుకుంది. ఈ సినిమాతోనే మళ్లీ థియేటర్లకు, అలాగే ఇండస్ట్రీకి ఊపు వస్తుందని ఆశిస్తోంది. ఓటీటీల నుంచి భారీ ఆఫర్లు వచ్చినా టెంప్ట్ కాని నిర్మాతలు.. ఇటు ట్రేడ్ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్న ఈ చిత్రాన్ని థియేటర్లలోనే రిలీజ్ చేసి మళ్లీ కోలీవుడ్ బాక్సాఫీస్‌కు కళ తీసుకురావాలని నిర్ణయించుకున్నారు.
ఐతే థియేటర్లు 100 శాతం ఆక్యుపెన్సీ నడిచే సమయానికే తమ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తుండగా.. ఇటీవల తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లందరూ కలిసి విజయ్‌ను కలిసి సంక్రాంతికి ‘మాస్టర్’ను రిలీజ్ చేసి తమను కాపాడాలని విన్నవించుకున్నారు. అతను కూడా నిర్మాతలతో మాట్లాడి ఆక్యుపెన్సీ సంగతెలా ఉన్నప్పటికీ ‘మాస్టర్’ను సంక్రాంతికి విడుదల చేసేద్దామని చెప్పినట్లు వార్తలొచ్చాయి.
దీంతో నిర్మాతలు జనవరి 13కు ఈ సినిమాను షెడ్యూల్ చేసి పెట్టుకున్నారు కానీ.. ఇంత కాలం ఎదురు చూసి, వడ్డీల భారం మోసి 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాను విడుదల చేసి రెవెన్యూను తగ్గించుకోవడం అవసరమా అన్న ఆలోచన వారిని వెంటాడుతూనే ఉంది. విజయ్ కూడా ఇదే విషయమై తర్జనభర్జనలు పడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే అతను తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి వద్దకు వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తమ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నామని.. థియేటర్లలో వంద శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇవ్వాలని అతను సీఎంను విన్నవించాడు. ఐతే ఇందుకు తమిళనాడు సీఎం అంగీకరిస్తాడా అన్నది డౌటే. ఎందుకంటే థియేటర్ల ఆక్యుపెన్సీపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలి. దేశవ్యాప్తంగా ఒకేసారి 100 పర్సంట్ ఆక్యుపెన్సీకి అనుమతి ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం లేనట్లే.
This post was last modified on December 28, 2020 2:18 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…