Movie News

సింహాన్ని దాచకుండా మంచి పని చేశారు

మే 1 విడుదల కాబోతున్న గాయపడ్డ సింహం మీద టీమ్ కన్నా ఎక్కువగా బయ్యర్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే రీ రిలీజులు తప్ప కొత్త సినిమాలు ఆడని దారుణమైన పరిస్థితి బాక్సాఫీస్ వద్ద నెలకొంది. స్టార్ హీరోలు రాకపోవడం, చిన్న సినిమాలు హడావిడి తప్ప అసలు విషయంలో చేతులు ఎత్తేయడం లాంటి కారణాలు ఆక్యుపెన్సీలు దారుణంగా పడిపోయేలా చేస్తున్నాయి. అంత బలహీనమైన వేసవిని ఎప్పుడూ చూడలేదని డిస్ట్రిబ్యూటర్లు కామెంట్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో గాయపడ్డ సింహం మీద పెద్ద బరువే ఉంది. నిన్న హైదరాబాద్ లో దుల్కర్ సల్మాన్ గెస్టుగా ట్రైలర్ లాంచ్ చేశారు. కాన్సెప్ట్ ఏంటో చూచాయగా చూపించారు. కూతురిని అమెరికా అల్లుడికే ఇచ్చిన చేయాలని కంకణం కట్టుకున్న బిగ్ షాట్, యుఎస్ మోజులో పడి అక్కడ ఉద్యోగం కోసం నానా తిప్పలు పడే ఒక యువకుడు, డబ్బులు ఇస్తే చాలు మంచి చెడు రెండూ చేసే ఒక లోకల్ డాన్, వీళ్ళతో పాటు అదనంగా పోలీస్ ఆఫీసర్ పాత్రలు. ఇలా సెటప్ ని నీట్ గా పరిచయం చేశారు.

తరుణ్ భాస్కర్ హీరో అయినప్పటికీ ఇందులో అన్ని క్యారెక్టర్లకు తగిన ప్రాధాన్యం ఇచ్చిన వైనం కనిపిస్తోంది. జెడి చక్రవర్తి చెప్పిన ప్రకారం చూస్తే ఇది మనీ, అనగనగా ఒక రోజు రేంజ్ లో పేలాలి. అసలే అలాంటి కామెడీలు మిస్ అయిపోయి జనాలు మొహం వాచిపోయి ఉన్నారు. ఈ టైంలో గాయపడ్డ సింహం ఊరట కలిగిస్తే అంతకన్నా కావాల్సింది ఏముంది. ట్విస్ట్ ఏంటంటే ఈ మూవీకి పోటీగా వస్తున్న కమెడియన్ సత్య జెట్లీది కూడా ఇదే జానరే.

గాయపడ్డ సింహం ఇంకో తెలివైన పని చేసింది. స్పెషల్ క్యామియో చేసిన శ్రీవిష్ణుని దాచి పెట్టకుండా చూపించేశారు. ఇలాంటి ఎలిమెంట్స్ మాములుగా సర్ప్రైజ్ రూపంలో హైడ్ చేస్తారు కానీ ఆడియన్స్ ని వేగంగా ఆకట్టుకోవడానికి టీమ్ తెలివైన ఎత్తుగడ వేసింది. ఓం శాంతి శాంతి శాంతితో ఫెయిల్యూర్ చూసిన తరుణ్ భాస్కర్ ఇప్పుడీ గాయపడ్డ సింహం మీద భారీ ఆశలు పెట్టుకున్నారు. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ ఎంటర్ టైనర్ కు స్వీకర్ ఆగస్తి సంగీతం సమకూర్చారు.

This post was last modified on April 26, 2026 3:46 pm

Share

Recent Posts

సీఎం రేవంత్ రెడ్డి ఫ్రెండ్ గెస్ట్ హౌస్ కు రమ్మన్నాడు

ఏమాత్రం అవకాశం దొరికినా చాలు మహిళలను లొంగదీసుకోవాలనుకునేవారి సంఖ్య పెరిగిపోతుంది. పెద్ద మనుషుల ముసుగులో హై ప్రొఫైల్ వ్యక్తులు కూడా…

25 minutes ago

న్యాచురల్ కాదు… ఇకపై అల్ట్రా కమర్షియల్

ఇప్పటిదాకా న్యాచురల్ స్టార్ ట్యాగ్ తో ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకుంటూ వచ్చిన నాని దసరా, హిట్…

2 hours ago

ప్యారడైజ్ కథా నేపథ్యం తెలుసా?

ఇంకో నాలుగు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘ది ప్యారడైజ్’ మూవీ. ముందు రోజు సాయంత్రమే పెయిడ్ ప్రిమియర్స్ కూడా…

5 hours ago

తెలంగాణ యాసపై ట్రోల్స్… ర‌ష్మిక రియాక్ష‌న్

సోష‌ల్ మీడియా జ‌నాలు దేనికి ఎప్పుడు ట్రిగ్గ‌ర్ అవుతారో తెలియ‌దు. ఎవ‌రి మ‌నోభావాలు ఎందుకు, ఎలా దెబ్బ తింటాయో అర్థం…

5 hours ago

ఏపీ మంత్రుల‌పై తెలంగాణ మంత్రుల ఆగ్ర‌హం…?

కేంద్రంలో ఏపీ నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఒక‌రు పౌర విమానయాన శాఖ మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు, మ‌రొక‌రు…

5 hours ago

స్విగ్గీ డెలివరీతో 53 లక్షలు ఎలాగబ్బా?

డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ ఏకంగా రూ.53 లక్షలు సంపాదించాడు చెన్నైకి చెందిన శంకర్. అవును.. మీరు విన్నది నిజమే. ఎనిమిదేళ్లుగా…

5 hours ago