Movie News

ఈ నలుగురు కొడితే 10 వేల కోట్లా?

తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా విస్తరించింది. ఒకప్పుడు వందల కోట్లతో ముగిసిపోయే లెక్కలు, ఇప్పుడు వేల కోట్ల దగ్గర ఆగుతున్నాయి. ముఖ్యంగా మన స్టార్లు గ్లోబల్ మార్కెట్ పై కన్నేయడంతో బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు జరుగుతున్నాయి. ఇక 2027 సమ్మర్ సీజన్ టాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద బిజినెస్ హబ్‌గా మారబోతోంది. మేకర్స్ ఇప్పటికే రిలీజ్ డేట్స్ పై ఒక క్లారిటీ ఇవ్వడంతో, ఆ ఏడాది మన టాప్ హీరోలందరూ కలిసి 10 వేల కోట్ల మార్కును అందుకుంటారా అనే చర్చ ఆసక్తికరంగా మారింది.

ఈ భారీ లక్ష్యం సాధ్యం కావాలంటే రేసులో ఉన్న నాలుగు పెద్ద ప్రాజెక్టులు బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించాలి. రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘వారణాసి’ ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ఒక్కటే సుమారు 3000 కోట్ల వసూళ్లను టార్గెట్ చేస్తోంది. రాజమౌళికి ఉన్న అంతర్జాతీయ గుర్తింపుతో బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఇది సాధ్యమేనని ట్రేడ్ వర్గాల నమ్మకం. దీనికి తోడు అల్లు అర్జున్ అట్లీ కలయికలో రాబోతున్న ‘రాకా’ కూడా సుమారు 2000 కోట్ల క్లబ్ పై కన్నేసింది. ఈ రెండు సినిమాలు పక్కాగా క్లిక్ అయితే, అక్కడే 5000 కోట్ల మార్కు దాదాపు ఖాయం అయిపోతుంది.

మరోవైపు ప్రభాస్ ‘స్పిరిట్’ మార్చి 5న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సందీప్ వంగా మేకింగ్ స్టైల్ కు ప్రభాస్ మాస్ ఇమేజ్ తోడైతే, ఈ సినిమా ఈజీగా 1500 నుంచి 2000 కోట్ల వసూళ్లను రాబట్టగలదని అంచనా. ఈ మధ్య కాలంలో ప్రభాస్ సినిమాలకు వస్తున్న ఓపెనింగ్స్ చూస్తుంటే ఇది పెద్ద టాస్క్ ఏమీ కాదు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ జూన్ 11న వస్తుందని మేకర్స్ ఇటీవల స్పష్టం చేశారు. ‘దేవర’తో సోలోగా 500 కోట్లు దాటేసిన తారక్ కు, నీల్ మార్క్ ఎలివేషన్లు తోడైతే వెయ్యి కోట్ల మార్కును దాటేయడం సునాయాసమే అవుతుంది.

ఇలా ఒక్కో సినిమాను విడివిడిగా చూస్తే మన హీరోలందరూ కలిసి 10 వేల కోట్ల మార్క్ ని అందుకోవడం సాధ్యమయ్యే లక్ష్యమే అనిపిస్తుంది. అయితే షూటింగ్ వేగం వీఎఫ్ఎక్స్ పనుల దృష్ట్యా ఈ తేదీల్లో ఏవైనా మార్పులు జరిగే అవకాశం ఉన్నా, మేకర్స్ మాత్రం ఇప్పుడే ఒక స్పష్టమైన ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. తక్కువ వ్యవధిలోనే ఇన్ని భారీ చిత్రాలు రావడం వల్ల ప్రేక్షకులపై ఆర్థిక భారం పడే అవకాశం ఉన్నా, కంటెంట్ లో దమ్ముంటే మాత్రం జనం ఆదరిస్తారనే ధీమా చిత్ర యూనిట్లలో కనిపిస్తోంది.

రియాలిటీ కి దగ్గరగా ఆలోచిస్తే, తెలుగు సినిమా ఇప్పుడున్న ఫామ్‌లో ఈ భారీ కల నెరవేరడం పెద్ద కష్టమేమీ కాదు. మన దర్శకులు, హీరోలు కేవలం సౌత్ లేదా నార్త్ మార్కెట్ కే పరిమితం కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా కథలను సిద్ధం చేస్తున్నారు. ఒకవేళ 2027లో ఈ అద్భుతం గనుక జరిగితే, టాలీవుడ్ నెంబర్ వన్ స్థానంలో నిలవడం ఖాయం. మరి మన స్టార్లు ఈ భారీ టార్గెట్ ను ఎలా రీచ్ అవుతారో, బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తారో వేచి చూడాలి.

This post was last modified on April 22, 2026 2:34 pm

Share

Recent Posts

ఏపీలో పెరిగిపోతున్న బీపీ… ఆ జిల్లాలో మరీ ఎక్కువ!

ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…

21 minutes ago

సినిమా షూటింగ్… ఐదుసార్లు చావుకు దగ్గరగా

సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…

5 hours ago

తెలంగాణా కాంగ్రెస్లో టిక్.. టిక్.. టిక్

తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…

8 hours ago

రంభ ఊర్వశి సరే… మరి అప్పట్లో ఎలా

సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…

8 hours ago

అభిమానుల విన్నపం నాగ్ పట్టించుకోలేదా

వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…

9 hours ago

భారత్ లోనే వివాహం చేసుకోండి

భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…

11 hours ago