Movie News

IPL: ఛాన్స్ మిస్ చేసుకుంటున్న పెద్ది

ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్ స్టేడియంలో జరిగిన SRH వర్సెస్ DC మ్యాచ్ దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. నాని ‘ది ప్యారడైజ్’ సినిమాలోని ‘ఆయా షేర్’ పాట స్టేడియం అంతా మారుమ్రోగిపోతుంటే, అది కేవలం సినిమా కోసం కాదు.. హైదరాబాద్ టీమ్ కోసం రాసినట్లుగా అనిపించింది. అనిరుధ్ కంపోజ్ చేసిన ఈ తెలంగాణ హై వోల్టేజ్ మాస్ సాంగ్ ఇప్పుడు పిల్లల నుండి పెద్దల వరకు అందరి నోళ్లలో నానుతోంది. 

గతంలో పుష్ప పాటలు ఐపీఎల్ కనెక్షన్‌తో గ్లోబల్ రేంజ్ కు వెళ్లినట్లే, ఇప్పుడు ఈ సాంగ్ కూడా అదే దారిలో దూసుకుపోతోంది. అయితే ఇదే సమయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా ‘పెద్ది’ ఆడియోపై సోషల్ మీడియాలో ఒక చర్చ నడుస్తోంది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వస్తున్న ఈ భారీ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు విడుదలయ్యాయి. 

ఒకటి హీరోయిన్ కోసం రాసిన ‘చికిరి’ సాంగ్ కాగా, రెండోది హీరో ఎలివేషన్ ఇచ్చే ‘రై రై రారా’ అనే సోలో సాంగ్. ఈ రెండు పాటలు యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ సాధించినా, ఎందుకో సామాన్య ప్రేక్షకులకు మాత్రం ‘ఆయా షేర్’ రేంజ్ లో కనెక్ట్ కాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సాధారణంగా రెహమాన్ సంగీతం వినగా వినగా మెల్లిగా ఎక్కుతుందని పేరుంది. కానీ నేటితరం ప్రేక్షకులు మాత్రం ఇన్ స్టంట్ గా కిక్ ఇచ్చే మాస్ బీట్స్ కోరుకుంటున్నారు. చరణ్ మాస్ ఇమేజ్ కు తగ్గట్టుగా ‘రై రై రారా’ సాంగ్ లో ఇంకాస్త పవర్ ఉండాల్సిందనే కామెంట్స్ వస్తున్నాయి. పెద్ది క్రికెట్ కు సంబంధించిన సినిమా కావడంతో ఐపిఎల్ ను బాగా వినియోగించుకుంటారనే చర్చ జరిగింది కానీ అనుకున్న రీతిలో సాంగ్స్ క్రికెట్ ఫాన్స్ కి రిజిస్టర్ కాలేదు.

అనిరుధ్ లాంటి నేటితరం సంగీత దర్శకులు నేటి జనరేషన్ పల్స్ పట్టుకుని పక్కా లోకల్ సౌండింగ్ తో సాంగ్స్ ఇస్తున్నారు. రెహమాన్ తన క్లాసిక్ స్టైల్ లో సాంగ్స్ ఇస్తున్నప్పటికీ, అవి మాస్ ఆడియెన్స్ కు కావాల్సినంత జోష్ ఇవ్వడం లేదని కొందరు ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే పాటలైనా ఆ లోటును భర్తీ చేస్తాయా అని అందరూ ఎదురుచూస్తున్నారు. రెహమాన్ తన మ్యూజిక్ లో మార్పులు చేసి నేటి ట్రెండ్ కు తగ్గట్టుగా మరిన్ని మాస్ ట్యూన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి రాబోయే స్పెషల్ సాంగ్ తో అయినా రెహమాన్ ఫ్యాన్స్ కు అసలైన కిక్ ఇస్తారో లేదో చూడాలి.

This post was last modified on April 22, 2026 4:08 pm

Share

Recent Posts

ఆలస్యం ‘ఆదర్శం’ కాకుంటే చాలు

ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…

20 minutes ago

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

5 hours ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

7 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

7 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

9 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

10 hours ago