ఇమేజ్ ఉన్న హీరోలకు ఎదురయ్యే డైలమా ఒకటుంది. అదే వెబ్ సిరీస్ లకు ఎస్ చెప్పాలా వద్దాని. నాగ చైతన్య దూత ద్వారా సక్సెస్ అవ్వొచ్చని నిరూపించినప్పటికీ మిగిలిన స్టార్లు ఈ రూటు పట్టుకోలేకపోతున్నారు. థియేటర్ అయితేనే మార్కెట్ ఉంటుందని ఇలా డిజిటల్ రూటు పడితే ఇమేజ్ కు సమస్య వస్తుందని భావిస్తున్న వాళ్ళు లేకపోలేదు. అయినా సరే కిరణ్ అబ్బవరం లాంటి అప్ కమింగ్ కథానాయకులు సైతం వీటి పట్ల మొగ్గు చూపుతున్నారు.
తాజాగా సిద్ధూ జొన్నలగడ్డ ఈ లిస్టులో చేరబోతున్నాడు. వెంకీ అట్లూరి త్వరలో నెట్ ఫ్లిక్స్ కోసం తీయబోయే భారీ వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. సిద్ధూ అంటే సదరు సంస్థలో మంచి బ్రాండ్ వేల్యూ ఉంది. టిల్లు స్క్వేర్ తెచ్చిన వ్యూస్ దెబ్బకు తెలుసు కదా, జాక్ ని ఫాన్సీ రేటు ఇచ్చి మరీ కొనుక్కుంది. అలాంటప్పుడు నేరుగా ఒరిజినల్ సిరీస్ తీస్తే ఇంకా మంచి స్పందన దక్కించుకోవచ్చనే ఉద్దేశంతో ఇలాంటి తెలివైన స్ట్రాటజీ వేసింది.
ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించనుంది. జానర్ గట్రా వివరాలు ఇంకా బయటికి రాలేదు కానీ యాక్షన్, క్రైమ్ , ఎమోషన్ మూడు మిక్స్ చేసిన పవర్ ఫుల్ సబ్జెక్టు రాసుకున్నారని వినికిడి. టెక్నికల్ టీమ్ తదితర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సూర్య నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న వెంకీ అట్లూరి అది విడుదల కాగానే సిద్ధూ సిరీస్ మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి.
హైదరాబాద్ లో ఆఫీస్ ప్రారంభించాక ఒరిజినల్ కంటెంట్ మీద నెట్ ఫ్లిక్స్ సీరియస్ గా దృష్టి పెడుతోంది. కేవలం సినిమాల మీద వందల కోట్లు ఇన్వెస్ట్ చేయడం కన్నా అదే స్టార్లతో డైరెక్ట్ ఓటిటి మూవీస్, వెబ్ సిరీస్ తీయడమే లాభసాటిగా ఉందని గుర్తించి ఆ మేరకు కాంబోలు సెట్ చేయడానికి ప్రత్యేకంగా ప్రణాళికలు వేసుకుంది. ఏది ఏమైనా సిద్ధూ జొన్నలగడ్డ తీసుకున్న నిర్ణయం తెలివైందే కాదు లాభసాటి కూడా. ఆదాయం ప్లస్ సమయం రెండూ తెలివిగా వాడుకోవచ్చు.
This post was last modified on April 22, 2026 8:20 am
ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…
మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…
ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…