సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండింగ్ టాపిక్‌గా మారుతుందో.. దేని మీద నెటిజన్లు చర్చలు పెడతారో చెప్పలేం. కొన్నిసార్లు ఎప్పటివో పాత వీడియోలు ఇప్పుడు వైరల్ అయి.. ట్రోలింగ్‌కు దారి తీస్తుంటాయి. అల్లు అర్జున్‌కు సంబంధించిన ఓ విషయం ఇప్పుడు ఇలాగే హాట్ టాపిక్‌గా మారింది.
గతంలో ఎప్పుడో బన్నీ తమ్ముడు అల్లు శిరీష్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో.. తన అన్న చదువు గురించి మాట్లాడాడు. బన్నీకి ముందు నుంచి ఎక్స్‌ట్రా కరికులర్ యాక్టివిటీస్ మీదే ఆసక్తి ఉండేదని, చదువులో వీక్ అని చెబుతూ.. అతను ఏడో తరగతిలో ఫెయిల్ అయిన విషయాన్ని వెల్లడించాడు.
ఆ ఇంటర్వ్యూ ఇచ్చినపుడు అదేమీ చర్చనీయాంశం కాలేదు. కానీ ఇప్పుడు బన్నీ ఇండియాలోనే టాప్ స్టార్లలో ఒకడిగా ఎదిగిపోవడం.. ఈ క్రమంలో తన అభిమానులు వేరే హీరోల ఫ్యాన్స్‌లో సోషల్ మీడియాలో తరచుగా గొడవ పడుతుండడం.. అవతలి హీరోలను ట్రోల్ చేస్తుండడం.. ఈ నేపథ్యంలో యాంటీ ఫ్యాన్స్‌కు ఈ వీడియో ఒక ఆయుధంలా దొరికింది.
ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటర్ ఫెయిల్ అనే విషయంలో బన్నీ ఫ్యాన్స్ తరచుగా ట్రోలింగ్ చేస్తుంటారు. కానీ బన్నీనే సెవన్త్ ఫెయిల్ అనే విషయం అనుకోకుండా వెలుగులోకి రావడంతో పవన్ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. బన్నీ అభిమానులతో ప్రభాస్ ఫ్యాన్స్‌కు కూడా వైరం ఉన్న నేపథ్యంలో వాళ్లు కూడా వీళ్లకు తోడయ్యారు. అందరూ కలిసి బన్నీని ఒక రేంజిలో ట్రోల్ చేస్తున్నారు. దీని మీద మీమ్స్ మోతెక్కిపోతున్నాయి.
ముఖ్యంగా ‘నువ్వు లేక నేను లేను’ సినిమాలో సునీల్ ‘‘సెనవ్త్ ఫెయిల్ సిక్స్త్ పాస్’’ డైలాగ్‌ను ఇప్పుడు తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఐతే దీనికి బదులుగా బన్నీ ఫ్యాన్స్ కూడా ఎదురుదాడి చేస్తున్నారు. ఈ వ్యవహారంలో బన్నీ పీఆర్ టీం కూడా జోక్యం చేసుకున్నట్లు కనిపిస్తోంది.
అల్లు శిరీష్ ఇంటర్వ్యూ వీడియో మీద కాపీ రైట్ స్ట్రైక్స్ వేయించి వాటిని సోషల్ మీడియా నుంచి డెలీట్ చేయించే పనిలో పడింది ఆ టీం. ట్రోల్స్ చేసుకోవడానికి, ఫ్యాన్ వార్స్ చేసుకోవడానికి ఎప్పుడు ఏం టాపిక్ దొరుకుతుందా అని చూసే టాలీవుడ్ సినీ అభిమానులకు ఇది మంచి కాలక్షేపంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates