Movie News

ధనుష్ కూడా ఇలా చేస్తే ఎలా?

పెద్ద బ్యాగ్రౌండ్ లేకపోయినా.. చాలా కష్టపడి స్టార్‌గా ఎదిగిన నటుడు ధనుష్. అతణ్ని చూడగానే సాధారణ మధ్యతరగతి మనిషిలానే అనిపిస్తుంది కానీ.. తన సినిమా ఒక్కటి చూస్తే ఫ్యాన్ అయిపోవడం ఖాయం. ఇలాగే తన టాలెంటుతో ముందుగా తమిళులను.. ఆపై తెలుగు వాళ్లను.. తర్వాత హిందీ ప్రేక్షకులను ఆకట్టుకుని.. క్రమంగా దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించాడు ధనుష్. తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న తమిళ స్టార్లలో అతనొకడు. ఈ ఫాలోయింగ్ అంతా ధనుష్ తన ప్రతిభతో సాధించుకున్నదే. అందులో అదృష్టం రవ్వంతైనా లేదు. 

చాలా ఏళ్ల పాటు డబ్బింగ్ సినిమాలతో పలకరిస్తూ వచ్చిన ధనుష్.. గత కొన్నేళ్లలో సార్, కుబేర లాంటి డైరెక్ట్ తెలుగు చిత్రాల్లోనూ నటించి ఇక్కడ తన మార్కెట్‌ను స్థిరపరుచుకున్నాడు. ఇలాంటి టైంలో తన సినిమాల తెలుగు డబ్బింగ్ విషయంలోనూ అతను జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సూర్య, కార్తి లాంటి హీరోలు తమ చిత్రాల టైటిళ్ల దగ్గర్నుంచి.. నేమ్ బోర్డ్స్, ఇతర విషయాల్లోనూ ఎంత జాగ్రత్త పడతారో తెలిసిందే. ముందు తన కొత్త సినిమాకు తెలుగులోనూ ‘కరుప్పు’ అనే టైటిల్ పెట్టుకున్న సూర్య, తర్వాత ‘వీరభద్రుడు’ అని మార్పించిన సంగతి తెలిసిందే.

కానీ ధనుష్ మాత్రం తన కొత్త చిత్రానికి తమిళంలో పెట్టుకున్న ‘కర’ అనే పేరునే తెలుగులోనూ కొనసాగిస్తున్నాడు. గత ఏడాది ‘ఇడ్లీ కొట్టు’ అనే అచ్చ తెలుగు టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ధనుష్. దానికి ఒక మోస్తరుగా వసూళ్లు వచ్చాయి. ఐతే ‘కర’ సినిమా ఇప్పటిదాకా తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేదు.

ఈ నెల 30న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ‘పోర్ తొళిల్’ అనే సూపర్ థ్రిల్లర్ తీసిన విఘ్నేష్ రాజా ఈ చిత్రాన్ని రూపొందించాడు. మమిత బైజు కథానాయికగా నటించింది. ఇవన్నీ ఈ సినిమాకు ఆకర్షణలే. కానీ టైటిల్ మాత్రం తమిళ వాసన వల్ల తెలుగు వాళ్లకు కనెక్ట్ కావట్లేదు. నిజానికి తమిళంలోనూ ఈ టైటిల్ పట్ల మిశ్రమ స్పందన వచ్చింది. అలాంటిది తెలుగులో ఈ టైటిలే కొనసాగించాలనుకోవడం విచిత్రం. 

కర అన్నది కరసామి అనే పేరు నుంచి తీసుకున్నట్లుగా భావిస్తున్నారు. హీరో పేరు కాబట్టి తెలుగులోనూ అలాగే వదిలేయాలని అనుకున్నారేమో. కానీ దాన్ని తెలుగులో ‘వీర’ అనో, ‘దొర’ అనో మార్చుకోవడానికి అవకాశముంది. కానీ టీం ఆ దిశగా ఆలోచించలేదు.

ఇటీవల మలయాళం నుంచి ‘పల్లిచట్టంబి’ అనే సినిమా వచ్చింది. ఆ టైటిల్ చూసి బెంబేలెత్తిపోయిన తెలుగు ప్రేక్షకులు ఆ మూవీని కనీసం కూడా పట్టించుకోలేదు. ఒక భాషలో ఒక డబ్బింగ్ సినిమాను రిలీజ్ చేసినపుడు కనీసం ఆ భాషలో ఒక టైటిల్ పెట్టాలన్న ఆలోచన కూడా వాటి మేకర్స్‌కు రాకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. దీని వల్ల కలిగే నష్టమేంటో సినిమా రిలీజైనపుడు ఆటోమేటిగ్గా అర్థమైపోతుంది.

This post was last modified on April 21, 2026 9:43 am

Share

Recent Posts

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

18 minutes ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

25 minutes ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

39 minutes ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

1 hour ago

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

4 hours ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

5 hours ago