చిన్న స్థాయి హీరోయిన్లు, టీవీ ఆర్టిస్టులు తమ సోషల్ మీడియా అకౌంట్లను సబ్‌స్క్రిప్షన్ మోడ్‌లోకి మార్చి, వాటి ద్వారా హాట్ కంటెంట్ ఇవ్వడం గురించి ఇటీవల పెద్ద చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ ఫేమ్ విష్ణుప్రియ భీమినేని ఈ సబ్‌స్క్రిప్షన్ల ద్వారా లక్షల్లో ఆదాయం పొందుతుండడడం గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరిగింది. ఈ విషయమై ఆమె మీద ఎవరో కేసు కూడా పెట్టారు. ఆ కేసు ఏమైందో కానీ.. ఈ చర్చ వల్ల తన ఫాలోవర్లు అమాంతం పెరగడం హాట్ టాపిక్‌గా మారింది.
ఐతే ఇదే సమయంలో చిన్న సినిమాల కథానాయిక అనన్య నాగళ్ళ గురించి కూడా చర్చ జరిగింది. ఆమెకు కూడా 600 మందికి పైగా పెయిడ్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారంటూ.. తను కూడా విష్ణుప్రియ బాటలోనే నడుస్తోందని విమర్శించడం మొదలుపెట్టారు. ఐతే ఈ విషయమై కొన్ని రోజులు మౌనం వహించిన అనన్య.. ఇప్పుడు ఒక వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చింది.
తాను హాట్ కంటెంట్ ఇవ్వడానికి, డబ్బులు సంపాదించడానికి సబ్‌స్క్రిప్షన్లు పెట్టలేదని అనన్య స్పష్టం చేసింది. తాను కొత్తగా ఏమీ ఇది మొదలుపెట్టలేదని, 2025లోనే సబ్‌స్క్రిప్షన్ మోడ్‌లోకి వెళ్లానని అనన్య వెల్లడించింది. తన ఆలోచనలు, అభిప్రాయాలను అభిమానులతో పంచుకోవడానికే సబ్‌స్క్రిప్షన్‌ను మొదలుపెట్టానని.. ముఖ్యంగా భక్తి కి సబంధించిన విషయాల కోసమే కానీ డబ్బులు సంపాదించడానికి కాదని ఆమె స్పష్టం చేసింది.
రెగ్యులర్‌గా అభిమానులతో టచ్‌లో ఉండాలి…అందరితో కనెక్ట్ అవ్వాలి అన్నది తన అభిమతమని అనన్య పేర్కొంది. నటిగా, మహిళగా జీవితంలో తాను ఎదుర్కొన్న అనుభవాలు, పరిస్థితులతో పాటు తన రోజువారి జీవితంలో ఎలా ఉంటుందో తెలియజేయాలన్నదే తన ఉద్దేశమని.. అభిమానుల నుంచి కొన్ని కొత్త విషయాలను నేర్చుకోవాలని అనుకుంటున్నానని.. అందరూ ఒక కమ్యూనిటీగా సాగాలని.. దీని ద్వారా సొసైటీకి ఏదైనా చిన్న హెల్ప్ చేయాలనే ఉద్దేశం తప్ప తనకు వేరే ఆలోచన లేదని.. ఇదంతా డబ్బుల కోసం చేస్తున్నది కాదని అనన్య క్లారిటీ ఇచ్చింది.
This post was last modified on April 19, 2026 9:13 pm
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…