ప్రతి సంవత్సరం దేశంలోనే అత్యధికంగా సినిమాలు నిర్మించే, రిలీజ్ చేసే ఇండస్ట్రీల్లో టాలీవుడ్ ఒకటి. దేశవ్యాప్తంగా మార్కెట్ ఉన్న హిందీ పరిశ్రమలో ఎన్ని సినిమాలు తెరకెక్కుతాయో దాదాపు అదే స్థాయిలో తెలుగులోనూ సినిమాలు తయారవుతుంటాయి.
కొన్నిసార్లు ఏడాదిలో అత్యధిక సినిమాలు తీసిన, రిలీజ్ చేసిన పరిశ్రమగా కూడా టాలీవుడ్ నిలుస్తుంటుంది. గత పదేళ్లలో తెలుగులో ఏ సంవత్సరం కూడా వందకంటే తక్కువ సినిమాలు రిలీజ్ కాకపోవడం గమనార్హం ఈ దశాబ్దం ఏడాదిలో, అంటే 2011లో టాలీవుడ్ నుంచి 120 స్ట్రెయిట్ తెలుగు సినిమాలు రిలీజ్ కావడం విశేషం. ఆ తర్వాత ఏడాది నుంచి సంఖ్య మరింత పెరుగుతూ వచ్చింది.
2012లో 127 తెలుగు సినిమాలు రిలీజైతే.. 2013లో ఆ సంఖ్య ఒకేసారి 178కి పెరిగింది. 2014లో అనూహ్యంగా ఏకంగా 194 సినిమాలు రిలీజయ్యాయి. ఇది ఇప్పటికీ టాలీవుడ్ రికార్డు. 2015 నుంచి వరుసగా గత అయిదేళ్లలో 172, 181, 177, 171, 193 సినిమాలు రిలీజయ్యాయి.
ఈ ఏడాది ఆరంభంలో ట్రెండ్ చూస్తే ఈసారి పాత రికార్డులు బద్దలవడం, తొలిసారి 200 సినిమాల రిలీజ్‌తో కొత్త రికార్డు నమోదు కావడం ఖాయమనుకున్నారు. కానీ కరోనా పుణ్యమా అని ప్రణాళికలన్నీ దెబ్బ తినేశాయి. థియేటర్లలో ఈ ఏడాది మొత్తంలో రిలీజైన సినిమాలు 49 మాత్రమే. మార్చి రెండో వారం తర్వాత థియేట్రికల్ రిలీజ్‌లు ఆగిపోయిన సంగతి తెలిసిందే. మళ్లీ ఈ నెలలోనే థియేటర్లు తెరుచుకున్నాయి. ఈ నెలలో థియేటర్లలో రిలీజైన స్ట్రెయిట్ తెలుగు సినిమాలు నాలుగైదే. ఈ ఏడాది అటు ఇటుగా మూడు నెలల వ్యవధిలోనే 49 సినిమాలు రిలీజయ్యాయంటే మిగతా 9 నెలల్లో ఈజీగా నంబర్ 150 దాటేసేది. అంటే కరోనా లేకుంటే డబుల్ సెంచరీ సాధ్యమయ్యేదన్నమాటే.
This post was last modified on December 28, 2020 8:07 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…