గురువారం టాలీవుడ్లో రెండు కొత్త పాటలు లాంచ్ అయ్యాయి. అందులో ఒకటి నిఖిల్ మూవీ ‘స్వయంభు’ నుంచి ‘రా రా ధీవర’ పేరుతో వచ్చిన ఫస్ట్ సింగిల్. ఇంకోటి అఖిల్ చిత్రం ‘లెనిన్’ నుంచి ‘ఎట్టా ఎట్టా’ అంటూ సాగిన సెకండ్ సింగిల్. ఈ రెండు పాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ పాటలు.. ఆ రెండు చిత్రాలకు క్రేజ్ తెచ్చిపెట్టేలా కనిపిస్తున్నాయి.
‘స్వయంభు’ నిఖిల్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ. ‘బాహుబలి’ తరహా భారీ కథాాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. నిఖిల్ లాంటి మిడ్ రేంజ్ హీరోతో ఇలాంటి సినిమా తీయడం ఆశ్చర్యమే. ఐతే ‘కార్తికేయ-2’ సక్సెస్ ఊపులో తనపై ఠాగూర్ మధు బృందం పెద్ద బడ్జెట్ పెట్టడానికి రెడీ అయింది. తమిళంలో పెద్ద దర్శకుల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన భరత్ కృష్ణమాచారి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఐతే సుదీర్ఘ కాలం చిత్రీకరణ దశలో ఉండడంతో ‘స్వయంభు’ మీద రకరకాల సందేహాలు కలిగాయి.
ఈ సినిమా పూర్తవుతుందా.. రిలీజవుతుందా.. ఔట్ పుట్ ఏమైనా తేడా కొడుతోందా అని మాట్లాడుకున్నారు. ఐతే కొన్ని నెలల ముందు రిలీజ్ చేసిన టీజర్ ఆకట్టుకున్నప్పటికీ.. తర్వాత టీం సైలెంట్ అయింది. కానీ ఇప్పుడు ఫస్ట్ సింగిల్‌తో జనాలను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది చిత్ర బృందం. ఈ పాటలో విజువల్స్, సెట్టింగ్స్, భారీతనం చూస్తే ఇది మామూలు సినిమా కాదనిపిస్తోంది. ఈ సాంగ్ లిరిక్స్, పాట పాడిన తీరు కూడా బాగున్నాయి. ఇన్‌స్టంట్‌గా గూస్ బంప్స్ ఇచ్చింది ఈ పాట. ఒక పెద్ద హీరో సినిమా రేంజిలో ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. సినిమా కూడా ఇంతే గ్రాండ్‌గా ఉంటుందనే ఆశలు కలుగుతున్నాయి.
ఇక ‘లెనిన్’ పాట విషయానికి వస్తే.. అందులో భాగ్యశ్రీ బోర్సే అందం, హావభావాలే హైలైట్. ఇప్పటికే నాలుగు సినిమాలు చేసినా.. సరైన విజయం దక్కించుకోలేక ఇబ్బంది పడుతున్న భాగ్యశ్రీ.. ‘లెనిన్’కు ప్రధాన ఆకర్షణగా మారేలా కనిపిస్తోంది. ‘ఎట్టా ఎట్టా’ పాట పూర్తి వీడియోను టీం రిలీజ్ చేసేయగా.. ఆద్యంతం చూపుతిప్పుకోని విధంగా భాగ్యశ్రీ తన గ్లామర్, స్టెప్స్, ఎక్స్‌ప్రెషన్స్‌తో కట్టిపడేసింది. అఖిల్ కూడా ‘ప్రెసిడెంటు గారి పెళ్ళాం’లో నాగార్జునను గుర్తుకు తెచ్చే లుక్‌తో ఆకట్టుకున్నాడు. తన డ్యాన్సులు, హావభావాలు కూడా ఆకట్టుకున్నాయి. సినిమా మీద జనాల్లో ఒక పాజిటివిటీ తీసుకొచ్చేలా సాగింది ఈ పాట.
ఐతే ఐపీఎల్ నడుస్తుండడంతో పాటలు ఇంకొద్దిగా రెసౌండ్ చేస్తే బాగుండు అనే అభిప్రాయం లేకపోలేదు. ముందు ముందు వదిలే పాటల్లో ఇంకా అందరికీ నచ్చే విధంగా ఉంటే సినిమాలకి మంచి బూస్ట్ దొరికినట్టే.
This post was last modified on April 17, 2026 5:02 pm
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…
వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…