Movie News

చైతు చేయి జారనున్న మంచి ఛాన్స్ ?

డిసెంబర్ 4 విడుదల కావాల్సిన వృషకర్మ మీద అనుమాన మేఘాలు కమ్ముకుంటున్నాయి. వాయిదా తప్పదనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో ఊపందుకుంది. నిన్నటి దాకా దీని గురించి ఎలాంటి క్లూ లేదు. ఎందుకంటే ప్రమోషన్లు జరుగుతున్నాయి. పబ్లిసిటీ ఆపడం లేదు. చైతు, మీనాక్షి చౌదరిలతో చేయించిన వీడియో కంటెంట్ బయటికి వదిలారు. అన్ని బాగుంటున్నాయని అనుకుంటున్న టైంలో హఠాత్తుగా ఇలా రెండు వారాల ముందు పోస్ట్ పోన్ బాంబ్ వేస్తే ఫ్యాన్స్ కలవర పడతారు.

ఇప్పటికైతే వాయిదా గురించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు కానీ ట్రేడ్ జనాలు దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అదే నిజమైన పక్షంలో చైతుకి ఒక మంచి అవకాశం మిస్ అయినట్టే. ఎందుకంటే డిసెంబర్ 4 వృషకర్మ స్థాయి పోటీ వేరొకటి లేదు. నితిన్ అలియాస్ రుక్మిణి పూర్తిగా వేరే జానర్. హిట్ అయినా సరే మార్కెట్ లెక్కలు ఒక లెవెల్ వరకు పరిమితంగా ఉంటాయి. కానీ చైతు మూవీ అలా కాదు. పాజిటివ్ టాక్ వస్తే కనీసం వంద కోట్ల థియేటర్ రిటర్న్ ఆశించవచ్చు.

అలాంటప్పుడు కష్టమో నష్టమో దానికే కట్టుబడి ఉండాలనేది అభిమానుల కోరిక. ఇన్ సైడ్ ఇన్ఫో ప్రకారం వృషకర్మ పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా పూర్తిగా అయిపోలేదు. బెస్ట్ అవుట్ ఫుట్ కోసం దర్శకుడు కార్తీక్ దండు టీమ్ రేయింబవళ్లు కష్టపడుతోంది. సెన్సార్ కాపీ రెడీ చేసేందుకు అందరూ వర్క్ చేస్తున్నారు. అయినా సరే డెడ్ లైన్ చేరుకోవడం పట్ల అనుమానం ఉండటంతో పోస్ట్ పోన్ చేస్తే ఎలా ఉంటుందనే కోణంలో రకరకాల చర్చలు జరుగుతున్నాయని తెలిసింది.

డిసెంబర్ 25 కింగ్ 100 తప్పుకుంటే అప్పుడా స్థానంలో వృషకర్మని దింపాలనేది కొత్త ప్లాన్. ఇవన్నీ ప్రతిపాదన దశలోనే ఉన్నాయి కాబట్టి నిర్ధారణగా ఏదీ చెప్పలేం కానీ నిప్పు లేనిదే పొగరాదు తరహాలో ఇదంతా ఊరికే లేచిన పుకారు అయితే కాదు. విరూపాక్షతో ఆకట్టుకున్న కార్తీక్ దండు మీద నమ్మకంతో భారీ బడ్జెట్ తో వృషకర్మ తీశారు నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్. దానికి తగ్గట్టు ఫలితం రావాలంటే బెస్ట్ రిలీజ్ దక్కాలి. మరి చివరికి ఏం చేస్తారో లెట్ వెయిట్ అండ్ సీ.

This post was last modified on November 21, 2026 5:38 pm

Share

Recent Posts

పరిటాల కలను నెరవేర్చిన కుమారుడు శ్రీరామ్

శ్రీస‌త్య‌సాయి జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్‌గా.. శ‌నివారం  సీనియ‌ర్ నాయ‌కుడు, దివంగ‌త ప‌రిటాల ర‌వి వార‌సుడు ప‌రిటాల శ్రీరాం ప్ర‌మాణ స్వీకారం…

2 hours ago

యలహంక ప్యాలెస్… ఇప్పుడేం చెప్తారు జగన్?

బెంగుళూరులోని యలహంక ప్యాలెస్ విషయంలో వైసీపీ అధినేత జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిలల మధ్య వివాదం ముదిరి పాకానపడినట్లు…

3 hours ago

కామెంట్లు చేసినోళ్లే కలెక్షన్లు కుమ్మరిస్తారు

అనిల్ రావిపూడి సినిమా వస్తోందంటే సోషల్ మీడియాలో ఒక వర్గం అలెర్టయిపోతుంది. కామెడీ పేరుతో క్రింజ్ చేస్తున్నాడని కొందరు, టీవీ…

4 hours ago

సొంత చెల్లిపై అడ్డమైన రాతలా… సీఎం చంద్రబాబు ఆవేదన

దేనికైనా హద్దు, అదుపు ఉంటుంది. రాజకీయాలు వేరు, వ్యక్తిగత బంధాలు వేరు. రెంటిని కలిపి చూడటం మూర్ఖులు చేసే పని…

4 hours ago

భారత్ ను చూసి నేర్చుకోమంటున్న ట్రంప్

అవసరమైనప్పుడు భారత్‌ను ప్రశంసించడం.. ప్రయోజనాల విషయంలో మాత్రం భారతీయులకు ఆంక్షలు విధించడం! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహారశైలిలో కనిపిస్తున్న…

4 hours ago

సురేష్ రైనా వస్తానంటే.. చెన్నై వద్దంటోందా?

ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌లో మహేంద్ర సింగ్ మోస్ట్ పాపులర్ క్రికెటర్ అనే విషయంలో ఎవరికీ సందేహాలు లేవు.…

5 hours ago