దేనికైనా హద్దు, అదుపు ఉంటుంది. రాజకీయాలు వేరు, వ్యక్తిగత బంధాలు వేరు. రెంటిని కలిపి చూడటం మూర్ఖులు చేసే పని అనే చెప్పాలి. దివంగత ముఖ్యమంత్రి కూతురు వైఎస్ షర్మిల కూతురి వివాహానికి ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించారు. స్వయంగా షర్మిల వెళ్లి చంద్రబాబుకు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఇందులో తప్పు పట్టాల్సింది ఏముందో ఎవరికీ అర్ధం కావడం లేదు.
వైసీపీ అధినేత జగన్ సొంత పత్రిక సాక్షికి మాత్రం ఇది తప్పుగా కనిపించింది. అంతే… చంద్రబాబుతో చెట్టపట్టాల్ అంటూ పతాక శీర్షికలో వార్త ప్రచురించింది. ఈ విషయంలో అన్నీ వర్గాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. కనీసం సొంత చెల్లి అని కూడా చూడకుండా జగన్ పత్రికలో ఇవేం పిచ్చి రాతలంటూ నెటిజన్లు మండిపడ్డారు. అదే విషయం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ప్రస్తావించారు.
మంగళగిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. అడ్డమైన రాతలు రాస్తుందని సాక్షి పత్రిక మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమార్తె పెళ్ళికి నన్ను ఆహ్వానిస్తే తప్పేముందని రోత రాతలు రాస్తుంది. పెళ్ళికి ఆహ్వాన పత్రిక అందజేస్తే సొంత చెల్లెలిపై కూడా అసభ్యకరంగా వార్తలు రాయిస్తారా? ఇదేం కల్చర్.. నాన్సెన్స్ అంటూ ఫైర్ అయ్యారు.
వైఎస్ రాజశేఖరరెడ్డికి నాకు మధ్య తీవ్రమైన రాజకీయ వైరుద్యం వుండేది. అయితేనేం మంచి స్నేహితులుగా మెలిగేవాళ్ళం. రాజకీయాన్ని, స్నేహాన్ని కలగాపులగం చేయలేదు మేము. రాజకీయాల కంటే మానవ సంబంధాలు ముఖ్యం. అప్పట్లో జగన్ పెళ్ళికి, షర్మిల పెళ్ళికి నన్ను ఆహ్వానించారు. ఆ రెండు పెళ్లిళ్లకు నేను వెళ్లి ఆశీర్వదించి వచ్చినట్టు జ్ఞాపకం అని తెలిపారు.
రాజశేఖరరెడ్డికి జగన్ కు మధ్య చాలా వ్యత్యాసం వుందని, జగన్ కు ఎలాంటి విలువలు లేవన్నారు. అధికారంలో వున్నప్పుడు రాష్ట్రాన్ని ధ్వంసం చేసాడని, ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా ఆయనలో మార్పు రాలేదని చెప్పారు. రాష్ట్రాన్ని నాశనం చేయడమే గొడ్డలి పార్టీ ఏకైక లక్ష్యమని విమర్శించారు.
స్థానిక ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేల పనితీరును ప్రజలు ఆమోదించలేదని స్పష్టం అయ్యిందన్నారు. పంచాయతీ ఎన్నికల తర్వాత మొత్తం ఫలితాలను విశ్లేశించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల కంటే స్థానిక ఎన్నికల్లో స్ట్రైకింగ్ రేట్ పెరిగిందని, ఇదే తరహాలో కూటమిని మరింతగా బలోపేతం చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు.
This post was last modified on November 21, 2026 5:30 pm
శ్రీసత్యసాయి జిల్లా పరిషత్ చైర్మన్‌గా.. శనివారం సీనియర్ నాయకుడు, దివంగత పరిటాల రవి వారసుడు పరిటాల శ్రీరాం ప్రమాణ స్వీకారం…
బెంగుళూరులోని యలహంక ప్యాలెస్ విషయంలో వైసీపీ అధినేత జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిలల మధ్య వివాదం ముదిరి పాకానపడినట్లు…
అనిల్ రావిపూడి సినిమా వస్తోందంటే సోషల్ మీడియాలో ఒక వర్గం అలెర్టయిపోతుంది. కామెడీ పేరుతో క్రింజ్ చేస్తున్నాడని కొందరు, టీవీ…
డిసెంబర్ 4 విడుదల కావాల్సిన వృషకర్మ మీద అనుమాన మేఘాలు కమ్ముకుంటున్నాయి. వాయిదా తప్పదనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో…
అవసరమైనప్పుడు భారత్‌ను ప్రశంసించడం.. ప్రయోజనాల విషయంలో మాత్రం భారతీయులకు ఆంక్షలు విధించడం! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహారశైలిలో కనిపిస్తున్న…
ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌లో మహేంద్ర సింగ్ మోస్ట్ పాపులర్ క్రికెటర్ అనే విషయంలో ఎవరికీ సందేహాలు లేవు.…