వాయిదాల మీద వాయిదాలు పడి డిసెంబరు 4న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’ చుట్టూ విపరీతమైన నెగెటివిటీ ముసురుకున్న సంగతి తెలిసిందే. బాగా ఆలస్యం అయిన ఈ సినిమా నుంచి కొన్ని రోజుల ముందు ట్రైలర్ లాంచ్ చేయగా.. దాని మీద విపరీతంగా ట్రోలింగ్ జరిగింది.
ట్రైలర్ లెంత్ చాలా ఎక్కువ ఉండడం.. చాలా షాట్స్ కృత్రిమంగా అనిపించడం.. సల్మాన్ లుక్స్ రకరకాలుగా ఉండడం మీద నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ఏఐని మరీ ఎక్కువగా వాడారని.. చాలా సీన్లు ఆర్టిఫిషియల్‌గా అనిపించాయని నెటిజన్లు కామెంట్లు చేశారు. ఈ విమర్శలు, ట్రోల్స్ మీద సల్మాన్ తాజాగా స్పందించాడు. ముఖ్యంగా ఏఐ వినియోగం మీద వచ్చిన కామెంట్స్ ఆయనకు తీవ్ర ఆగ్రహమే తెప్పించాయి.
‘‘మా సినిమాలో ఏఐ ఉపయోగించారని విమర్శిస్తున్నారు కదా. వాళ్లేమైనా ఏఐ నిపుణులా.. వీఎఫెక్స్ స్పెషలిస్టులా.. మీ కామెంట్లు అన్నీ నా దృష్టికి వస్తున్నాయి. నిజమైన లొకేషన్లలో షూట్ చేసిన సన్నివేశాలను కూడా వీఎఫెక్స్ అని, ఏఐ అని ఆరోపించడం కరెక్ట్ కాదు. నా సినిమా గురించి, నా గురించి చెడుగా మాట్లాడడం వల్ల ఎవరికైనా వ్యూస్, ఫాలోవర్లు వస్తుంటే నాకు అభ్యంతరం లేదు. నా కారణంగా వాళ్లు పేరు ప్రఖ్యాతులు, డబ్బు సంపాదించుకుంటూ ఉంటే నాకు సంతోషమే. దేవుడు వారిని చల్లగా చూడాలి.
ట్రైలర్ చాలా పెద్దగా ఉందని, అందులోనే సినిమా మొత్తం చూపించేశారని కొందరు అంటున్నారు. మేం సినిమా మొత్తాన్ని చూపించలేదు. డిసెంబరు 4న సినిమా చూసినపుడు మీకు విషయం అర్థమవుతుంది. కవర్ పేజీని చూసి పుస్తకాన్ని అంచనా వేయకూడదని అంటారు. మా సినిమా కూడా అంతే. ఇందులో అనూహ్యమైన మలుపులు ఉన్నాయి. ఐదు నిమిషాల ట్రైలర్లోనే మీకు అన్ని పాయింట్స్ కనిపిస్తే.. రెండున్నర గంటల సినిమాలో ఇంకెన్ని ఉంటాయో ఊహించుకోండి’’ అని సల్మాన్ వ్యాఖ్యానించాడు. అపూర్వ లఖియా రూపొందించిన ‘మాతృభూమి’ని సల్మానే స్వయంగా నిర్మించడం విశేషం.
This post was last modified on November 21, 2026 3:19 pm
శ్రీసత్యసాయి జిల్లా పరిషత్ చైర్మన్‌గా.. శనివారం సీనియర్ నాయకుడు, దివంగత పరిటాల రవి వారసుడు పరిటాల శ్రీరాం ప్రమాణ స్వీకారం…
బెంగుళూరులోని యలహంక ప్యాలెస్ విషయంలో వైసీపీ అధినేత జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిలల మధ్య వివాదం ముదిరి పాకానపడినట్లు…
అనిల్ రావిపూడి సినిమా వస్తోందంటే సోషల్ మీడియాలో ఒక వర్గం అలెర్టయిపోతుంది. కామెడీ పేరుతో క్రింజ్ చేస్తున్నాడని కొందరు, టీవీ…
డిసెంబర్ 4 విడుదల కావాల్సిన వృషకర్మ మీద అనుమాన మేఘాలు కమ్ముకుంటున్నాయి. వాయిదా తప్పదనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో…
దేనికైనా హద్దు, అదుపు ఉంటుంది. రాజకీయాలు వేరు, వ్యక్తిగత బంధాలు వేరు. రెంటిని కలిపి చూడటం మూర్ఖులు చేసే పని…
అవసరమైనప్పుడు భారత్‌ను ప్రశంసించడం.. ప్రయోజనాల విషయంలో మాత్రం భారతీయులకు ఆంక్షలు విధించడం! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహారశైలిలో కనిపిస్తున్న…