Movie News

మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఇంకెప్పుడు?

బాలయ్య అభిమానులు ఎదురుచూసే కొద్దీ దూరం వెళ్తున్నాడు మోక్షజ్ఞ. ఎప్పుడెప్పుడాని వెయిట్ చేస్తుంటే ఇప్పుడప్పుడే కాదనే తరహాలో ఇస్తున్న సంకేతాలు చూస్తే అసలు డెబ్యూ చేస్తాడా లేదానే అనుమానాలు ఫ్యాన్స్ లో మొదలయ్యాయి. ప్రశాంత్ వర్మ ప్యాన్ ఇండియా మూవీ క్యాన్సిల్ చేశారు. తర్వాత ఒకరిద్దరు దర్శకులు ట్రై చేశారు కానీ పనవ్వలేదు. ఆరేడు సంవత్సరాల క్రితమే నిర్మాత సాయి కొర్రపాటి ‘రానే వచ్చాడు మా రామయ్య’ టైటిల్ తో ఒక కథ కూడా సిద్ధం చేసి ఉంచారు.

ఇవన్నీ ప్రపోజల్ స్టేజిలోనే ఆగిపోయాయి. మరోవైపు బాలయ్య తన మానాన తాను వరసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. దర్శకుడు గోపీచంద్ మలినేనిది సెట్స్ మీద ఉండగా తర్వాత వివేక్ ఆత్రేయ, విజయ్ కనకమేడలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆదిత్య 999 మ్యాక్స్ పెండింగ్ ఉంది. ఇది క్రిష్ కు ఇవ్వాలా లేక స్వంతంగా డైరెక్ట్ చేసుకోవాలానే డైలమాలో బాలయ్య లేట్ చేస్తున్నారు. తండ్రి ఎన్టీఆర్ అన్ని కాకపోయినా కనీసం ఒకటి రెండు దర్శకత్వం చేయాలనేది బాలకృష్ణ కోరికట.

ఒకవేళ మోక్షజ్ఞకు నటించే ఆసక్తి కనక లేకపోతే అదేదో ముందే చెప్పేస్తే బెటర్. ఫ్యాన్స్ ఎదురు చూడటం మానేస్తారు. ఎందుకంటే నందమూరి మూడో తరంలో ఇప్పటికి పెద్ద స్థాయికి చేరుకుంది జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే. కళ్యాణ్ రామ్ ఇంకా ఎదురీదుతూనే ఉన్నాడు. జానకిరామ్ అబ్బాయిని ఆ మధ్య వైవిఎస్ చౌదరి గ్రాండ్ గా లాంచ్ చేశారు కానీ తర్వాత షూటింగ్ అప్డేట్స్ లేవు. తీస్తున్నారా లేక బ్రేక్ ఇచ్చారా లాంటి వివరాలు కనుక్కుంటే కుటుంబంలో ఒకరు హఠాత్తుగా కాలం చేయడం వల్ల హోల్డ్ చేశారని, త్వరలోనే తిరిగి సెట్స్ పైకి తీసుకెళ్లే ప్లానింగ్ లో ఉన్నారని తెలిసింది.

ఏది ఏమైనా ఫ్యాన్స్ కోసమైనా బాలయ్య క్లారిటీ ఇస్తే బెటర్. మోక్షజ్ఞ వయసు ఆల్రెడీ మూడు పదులు దాటింది. ఇప్పుడు స్టార్ వారసులుగా ఉన్న వాళ్ళందరూ దాదాపు పాతిక వయసులోపే తెరంగేట్రం చేశారు. అంత త్వరగా వచ్చినా కూడా ఇరవై, పాతిక సంవత్సరాల్లో ఏ  ఒక్కరు పట్టుమని ముప్పై సినిమాలు చేయలేకపోయారు. పరిస్థితులు అలా ఉన్నాయి. మరి మోక్షజ్ఞ ఇంతకన్నా జాప్యం చేయడం భావ్యం కాదని అభిమానులు ఫీలవుతున్నారు. ఏం చేస్తారో చూడాలి మరి.

This post was last modified on April 17, 2026 12:00 pm

Share

Recent Posts

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

13 minutes ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

53 minutes ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

9 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

11 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

11 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

12 hours ago