Movie News

వంగా అసలు ఆలోచన ఏంటి?

సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాదు, ఇండియన్ సినిమాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్. ‘యానిమల్’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన తర్వాత, అతని క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కు వెళ్ళింది. ప్రస్తుతం ప్రభాస్‌తో చేస్తున్న ‘స్పిరిట్’ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. సాధారణంగా ఒక పెద్ద సినిమా సెట్స్ మీదకు వెళ్తుందంటేనే ఓటీటీ సంస్థలు కోట్లలో ఆఫర్లు కురిపిస్తాయి. కానీ సందీప్ వంగా మాత్రం ఈ విషయంలో చాలా పక్కాగా కనిపిస్తున్నారు. భారీ ఆఫర్లు వస్తున్నా కూడా ప్రస్తుతానికి నాన్ థియేట్రికల్ డీల్స్‌ను హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తోంది.

సాధారణంగా నిర్మాతలు సినిమా షూటింగ్ ప్రారంభంలోనే డిజిటల్ రైట్స్ అమ్మేసి సేఫ్ జోన్ లోకి వెళ్లాలని చూస్తుంటారు. కానీ ఈ సినిమాకు టీ సిరీస్‌తో పాటు సందీప్ వంగా హోమ్ బ్యానర్ ‘భద్రకాళి పిక్చర్స్’ కూడా సహ నిర్మాతగా ఉంది. సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా స్వయంగా నిర్మాణ బాధ్యతలను పర్యవేక్షిస్తుండటంతో, బిజినెస్ విషయంలో ఏమాత్రం తొందరపడటం లేదు. సినిమా షూటింగ్ పూర్తయి, ఒక స్పష్టమైన అవుట్‌పుట్ వచ్చిన తర్వాతే డీల్స్ క్లోజ్ చేయాలనేది వీరి ఆలోచనగా కనిపిస్తోంది. 

ప్రభాస్-వంగా కాంబినేషన్ అంటేనే అది ఒక డెడ్లీ కాంబో. ప్రభాస్ లోని మాస్ యాంగిల్‌ను వంగా తనదైన స్టైల్‌లో ఎలా చూపిస్తారనే ఆసక్తి అందరిలోనూ ఉంది. అందుకే ఈ సినిమాపై బిజినెస్ వర్గాల్లో విపరీతమైన పోటీ నెలకొంది. ఈ ఏడాది చివర్లో డీల్స్ ఓపెన్ చేస్తే, అప్పటికి సినిమా గ్లింప్స్ వంటివి వస్తే ఇంకా రేంజ్ పెరుగుతుందని మేకర్స్ భావిస్తున్నారు. వంగా సినిమాల్లో ఉండే ఇంటెన్సిటీ గురించి మనకు తెలిసిందే. 

‘స్పిరిట్’లో ప్రభాస్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. వంగా మార్క్ వైలెన్స్ అండ్ ఎమోషన్ తోడైతే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయం. ప్రస్తుతం ప్రభాస్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో, ‘స్పిరిట్’ పనులు నెమ్మదిగా కానీ చాలా పక్కాగా సాగుతున్నాయి. 2027 మార్చిలో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నారు. అంటే ప్రమోషన్లకు, బిజినెస్ కు ఇంకా చాలా సమయం ఉంది.

ప్రస్తుతం ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ స్టార్స్ గా ఉన్న ప్రభాస్ సందీప్ వంగా కలయిక వల్ల ‘స్పిరిట్’ బిజినెస్ వాల్యూ రూ. 500 కోట్లకు పైగానే ఉండవచ్చని తెలుస్తోంది. అందుకే ఓటీటీ సంస్థలు ఇప్పుడే లైన్ లోకి వస్తున్నాయి. అయితే వంగా స్టైలే వేరు. ఆయన సినిమా కంటెంట్ తోనే మార్కెట్ లో డిమాండ్ క్రియేట్ చేయాలనుకుంటారు. అందుకే ఇప్పుడు తొందరపడి తక్కువ రేటుకు రైట్స్ అమ్మేయకుండా, సినిమా స్థాయిని పెంచిన తర్వాతే డీల్స్ క్లోజ్ చేయాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.

This post was last modified on April 17, 2026 10:40 am

Share

Recent Posts

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

3 minutes ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

22 minutes ago

టీ 20 చూస్తూ పారిశ్రామికవేత్తలతో చర్చించా

నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…

27 minutes ago

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

1 hour ago

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

4 hours ago

నార్త్ రాముడు.. సౌత్ శివుడు… రేవంత్ కరెక్టేనా?

రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉండే వారి నుంచి వచ్చే మాటల వెనుక ఊహకు అందని లెక్కలు.. సమీకరణాలు ఉంటాయి. అందునా..…

4 hours ago