Movie News

ప్రతాప్ కష్టాలు పగవాడికి కూడా వద్దు

రేపు విడుదల కాబోతున్న  పాపం ప్రతాప్ కు టైటిల్ కు తగ్గట్టే చివరి నిమిషం వరకు అయ్యో పాపం అనిపించే పరిణామాలే జరుగుతున్నాయి. చివరి నిమిషంలో సెన్సార్ చిక్కు ఒకటి వచ్చి పడటంతో నిర్మాతలు ఆఘమేఘాల మీద పరుగులు పెడుతున్నారు. సినిమాలో ఎలాంటి జంతువులను వాడలేదని అనిమల్ వెల్ఫేర్ బోర్డు నుంచి ఒక సర్టిఫికెట్ తెచ్చుకోవాలి. కానీ ఎక్కడో పొరపాటు జరగడంతో దాన్ని మర్చిపోయారు.

అది సబ్మిట్ చేస్తే తప్ప సెన్సార్ క్లియరెన్స్ రాదు. కథకు సంబంధించిన ఒక ముఖ్యమైన ట్విస్టు జంతువు మీదే ఉంటుందట. నిన్న సోషల్ మీడియాలో ఈ లీకు తెగ చక్కర్లు కొట్టింది. పగలు మనిషిగా రాత్రి మృగంగా మారిపోయే జంతువు పాయింట్ అంటూ తెగ ఊదరగొట్టారు. ఇది పాపం ప్రతాప్ అనే క్లారిటీ వచ్చేసినట్టే. ఈ లెక్కన హైదరాబాద్ లో ప్లాన్ చేసిన నైట్ ప్రీమియర్లు దాదాపుగా లేనట్టే. ఒకవేళ ఆ టైంకి సమస్య పరిష్కారం కాకపోతే రేపు ఉదయం షోలు లేట్ కావొచ్చు.

దీనికొకటే కాదు గతంలో దండోరా కూడా ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసింది. అప్పుడు ప్రొడ్యూసర్లు పడిన టెన్షన్ అంతా ఇంతా కాదు. ఎట్టకేలకు సెన్సార్ తెచ్చుకుని సమయానికి షోలు వేయగలిగారు. కానీ అప్పుడు వచ్చిన ఇష్యూ జంతువులది కాదు. కొన్ని సన్నివేశాల పట్ల అభ్యంతరం వచ్చింది. అది అంతర్గతంగా సెట్ చేసుకునేది కాబట్టి టైంకి సాల్వ్ అయ్యింది. కానీ పాపం ప్రతాప్ ఇప్పుడు బయటి నుంచి నో యానిమల్ పత్రం తీసుకురావాలి.

ఏది ఏమైనా ఇకపై నిర్మాతలు ఇలాంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కనీసం వారం ముందే ఇలాంటి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యేలా చూసుకోవాలి. లేకపోతే డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఎగ్జిబిటర్ల దాకా అందరూ ఇబ్బంది పడతారు. తిమ్మరాజుపల్లి టీవీ, బ్యాడ్ బాయ్ కార్తీక్, పల్లిచట్టంబితో పోటీ పడుతున్న పాపం ప్రతాప్ కు అన్నీ సానుభూతులే దక్కుతున్నాయి. ఇదంతా ఎలా ఉన్నా కనీసం థియేటర్లలో సూపర్ అయితే తిరువీర్ కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది.

This post was last modified on April 16, 2026 2:06 pm

Share

Recent Posts

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

29 minutes ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

57 minutes ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

2 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

9 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

12 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

12 hours ago