Movie News

సింగర్ మంగ్లీ… చిన్న కథ కాదు

తెలుగులో ప్రస్తుతం నంబర్ వన్ ఫిమేల్ ఫోక్ సింగర్‌ మంగ్లీనే అనడంలో మరో మాట లేదు. చిన్న స్థాయిలో ప్రైవేట్ సాంగ్స్ చేసుకునే అమ్మాయి.. సినిమాల్లో భారీ పారితోషకంతో స్పెషల్ సాంగ్స్ చేసే స్థాయికి ఎదిగింది. ప్రైవేట్ ఈవెంట్లకు హాజరవ్వాలన్నా.. హీరోయిన్ల రేంజిలో ఆమెకు భారీగా రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందే. ఐతే ఇంత పెద్ద స్థాయికి ఎదిగిన మంగ్లీ తరచుగా ఏదో ఒక వివాదంతో వార్తల్లోకి వస్తుండడమే ఆశ్చర్యం కలిగించే విషయం.

గతంలో ఆమె చేసిన రాజకీయ వ్యాఖ్యలు.. తీసుకున్న పొలిటికల్ స్టాండ్ విమర్శలకు దారి తీశాయి. ఇక ఆ మధ్య ఆమె హోస్ట్ చేసిన ఒక పార్టీలో డ్రగ్స్ ఉపయోగించారన్న ఆరోపణలు కలకలం రేపాయి. తాజాగా మంగ్లీ ఓ పెద్ద వివాదంలో చిక్కుకుంది. మైక్రో ఫైనాన్స్ పేరిట మంగ్లీ, ఇంకో ఇద్దరు కలిసి రూ.10 కోట్లకు మోసం చేసినట్లుగా సుబ్బారావు అనే న్యాయవాది కేసు పెట్టడం కలకలం రేపుతోంది.

తన దగ్గర రూ.10 కోట్లు తీసుకుని మోసం చేసిందని.. డబ్బుల కోసం అడిగితే యాక్సిడెంట్ చేసి చంపుతానని.. శవం కూడా దొరకకుండా చేస్తానని మంగ్లీ బెదిరించిందని సుబ్బారావు హైదరాబాద్‌ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైక్రో ఫైనాన్స్ పేరు చెప్పని తనతో పాటు దాదాపు 150 మందిని మంగ్లీ బృందం మోసం చేసిందని.. మంగ్లీ సోదరుడు శివ, ప్రముఖ దర్శక నిర్మాత వేణు ఉడుగుల కూడా ఈ కుట్రలో భాగమని బాధితుడు ఆరోపించాడు.

వారి నుంచి తనకు ప్రాణ హాని ఉందని సుబ్బారావు ఫిర్యాదు చేయడంతో పోలీసులు.. బీఎన్ఎస్ 351 (2), 352 సెక్షన్ల కింద మంగ్లీ, వేణు ఉడుగుల, శివల మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వివాదంపై మంగ్లీ, వేణు ఇంకా ఏమీ స్పందించలేదు. దర్శకుడిగా ‘నీదీ నాదీ ఒకే కథ’, ‘విరాటపర్వం’ లాంటి మంచి సినిమాలు తీసిన వేణు ఉడుగుల.. నిర్మాతగా మారి ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే.

This post was last modified on April 11, 2026 3:23 pm

Share

Recent Posts

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

57 minutes ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

1 hour ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

2 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

10 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

12 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

12 hours ago