ఏప్రిల్ నెలలో రెండు శుక్రవారాలు అయిపోయాయి. మొదటి బంచ్ లో వచ్చిన బైకర్, రాకాసలు పాజిటివ్ టాక్స్ తోనూ అద్భుతాలు చేయలేకపోయాయి. ఆడియన్స్ కోరుకున్నవి పూర్తిగా ఇవ్వడంలో పడిన తడబాటు వల్ల బ్రేక్ ఈవెన్ దాటితే చాలానేలా వసూళ్లు మెల్లగా సాగుతున్నాయి. ఇక తాజాగా వచ్చిన డెకాయిట్ ఫలితం తేలడానికి ఇంకా టైం పడుతుంది. మంచి ఓపెనింగ్స్ తో పాటు కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మొదటి ఆటకే చేతులు ఎత్తేసింది.
ఇప్పుడు ఏప్రిల్ 17 కొత్త బ్యాచ్ రెడీ అవుతోంది. నాగశౌర్య చాలా గ్యాప్ తర్వాత చేసిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ ఎలాంటి సౌండ్ చేయడం లేదు. ఇమేజ్ ఉన్న హీరోకు సోషల్ మీడియాలో అయినా కనీస బజ్ ఉండాలి. కానీ విపరీతమైన ఆలస్యంతో పాటు ట్రైలర్ రొటీన్ గా అనిపించడం వల్ల ఆడియన్స్ దృష్టి దీని మీద పడటం లేదు. కిరణ్ అబ్బవరం నిర్మించిన ‘తిమ్మరాజుపల్లి టీవీ’కి పబ్లిసిటీ బాగుంది కానీ అది ఓపెనింగ్స్ తెస్తుందా అనేది డౌటే. యునానిమస్ టాక్ రావాల్సిందే.
తిరువీర్ హీరోగా ఈటీవీ విన్ నిర్మించిన ‘పాపం ప్రతాప్’ అదే రోజు రానుంది. ఓటిటిలో హిట్టవుతున్న తిరువీర్ కు థియేటర్ బ్రేక్ దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి దీంతో అయినా నెరవేరుతుందో లేదో చూడాలి. ఇవి కాకుండా రెండు రోజుల ముందు మలయాళ డబ్బింగ్ ‘పల్లి చట్టంబి’ రిలీజవుతోంది. ఇది డెకాయిట్ తో పాటు రావాల్సింది ఒక వారం పోస్ట్ పోన్ అయ్యింది. అక్షయ్ కుమార్ హీరోగా రూపొందిన బాలీవుడ్ మూవీ ‘భూత్ బంగ్లా’ సైతం ఏప్రిల్ 17 వస్తోంది.
కౌంట్ అయితే పైకి కనిపిస్తోంది కానీ వీటిలో మొదటి రోజే జనాన్ని రప్పించే బాపతు లేకపోవడమే విచిత్రం. టాక్, రివ్యూస్ మీద ఆధారపడి ఆడియన్స్ కోసం ఎదురు చూడాలి తప్పించి మొదటి ఆటకే వాళ్ళను ఎక్స్ పెక్ట్ చేయడం కష్టం. ఎలా చూసినా ఫిబ్రవరి నుంచి చాలా బిసి సెంటర్లు డ్రైగా గడిచిపోతున్నాయి. రోజుల తరబడి హౌస్ ఫుల్స్ చేయించే సినిమాల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాయి. పెద్ది హ్యాండ్ ఇవ్వడంతో సిచువేషన్ మరింత బ్యాడ్ అయిపోయింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates