Movie News

సీతారామంలో చేసిన అన్యాయానికి బదులు

బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ త‌న కెరీర్లో ఎన్ని సినిమాలైనా చేయ‌నీ.. సీతారామం చిత్రంలో ఆమె పోషించిన సీతామాల‌క్ష్మి పాత్ర మాత్రం చాలా చాలా స్పెష‌ల్. అదొక క‌ల్పిత పాత్ర అయినా.. ఆమె సినిమాలో మాత్ర‌మే సీతామాలక్ష్మి అయినా.. నిజంగా అలాంటి ఓ అమ్మాయి ఉన్న‌ట్లు, రామ్ దూరం కావ‌డంతో ఆమెకు తీవ్ర అన్యాయం జ‌రిగిన‌ట్లు ఫీలైపోతుంటారు జ‌నం.లె

జెండ‌రీ డైరెక్ట‌ర్ రాఘ‌వేంద్ర‌రావు సైతం.. ఒక సంద‌ర్భంలో రామ్, సీత దూరం కావ‌డం గురించి బాధ ప‌డుతూ, ఈ సినిమాకు సీక్వెల్ తీసి ఇద్ద‌రినీ క‌లిపేయండ‌ని ఈ చిత్ర బృందాన్ని కోర‌డం గ‌మ‌నార్హం. తాజాగా సీతారామంలో ఆర్మీ మేజ‌ర్ విష్ణు శ‌ర్మ‌గా కీల‌క పాత్ర చేసిన సుమంత్.. ఆ సినిమాలో సీతామాల‌క్ష్మికి చేసిన అన్యాయానికి గాను మృణాల్ ఠాకూర్‌కు స్టేజ్ మీది నుంచి సారీ చెప్పాడు. మృణాల్ క‌థానాయికగా న‌టించిన డెకాయిట్ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా వ‌చ్చిన సుమంత్.. సీతారామం ప్ర‌స్తావ‌న తెచ్చాడు.

ఆ సినిమాలో రామ్‌ను దూరం చేసినందుకు గాను తాను సీత‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాన‌ని.. ఆ నేప‌థ్యంలో ఒక స‌న్నివేశం తీశార‌ని.. కానీ ఎడిటింగ్‌లో భాగంగా, త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ఆ స‌న్నివేశం తీసేశార‌ని సుమంత్ వెల్ల‌డించాడు. కాబ‌ట్టి ఆ సినిమాలో సీత‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌లేక‌పోయినందుకు.. ఇప్పుడు ఈ స్టేజ్ మీది నుంచి సీత‌కు మ‌న‌స్ఫూర్తిగా సారీ చెబుతున్నాన‌ని సుమంత్ వ్యాఖ్యానించాడు.

అంతే కాక‌.. సీతారామంలో చేసిన అన్యాయానికి బ‌దులుగా త‌న చెల్లెలు సుప్రియ ప్రొడ్యూస్ చేసిన డెకాయిట్ మూవీలో మృణాల్‌కు అవ‌కాశం ఇప్పించాన‌ని కూడా సుమంత్ వ్యాఖ్యానించాడు. సీతారామం లాగే డెకాయిట్ సైతం మృణాల్ కెరీర్లో మైల్‌స్టోన్ మూవీగా నిలుస్తుంద‌ని సుమంత్ ధీమా వ్య‌క్తం చేశాడు.

ఇక త‌న చెల్లెలు సుప్రియ గురించి మాట్లాడుతూ.. ఆమెను అంద‌రూ వైలెంట్ ప్రొడ్యూస‌ర్ అనుకుంటార‌ని.. కానీ అది నిజం కాద‌ని, ఆమె మ‌న‌సు వెన్న అని సుమంత్ పేర్కొన్నాడు. డెకాయిట్ ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే.

This post was last modified on April 8, 2026 9:30 am

Share

Recent Posts

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

1 hour ago

మల్టీస్టారర్ మూవీకి మర్చిపోలేని అవమానం

కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…

2 hours ago

ఆంధ్రా ముద్దుబిడ్డ అనంత్ అంబానీ

నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…

2 hours ago

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

3 hours ago

వివేకా కేసులో అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు

వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…

3 hours ago

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

4 hours ago