Movie News

రావణుడిని అంత గొప్పగా చూపించగలరా

ఇటీవలే విడుదలైన రామాయణ పార్ట్ 1 టీజర్ మీద మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ఫీడ్ బ్యాక్ ఎలా ఉన్నా టీమ్ మాత్రం తామో గొప్ప అద్భుతాన్ని చూపించిన ఫీలింగ్ లో ఉంది. ఇదిలా ఉండగా దర్శకుడు నితేశ్ తివారి ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన కబుర్లు పంచుకున్నారు. ముఖ్యంగా యష్ పోషించిన రావణుడి పాత్ర గురించి ఓ రేంజ్ ఎలివేషన్లు ఇస్తున్నారు. నెగటివ్ కన్నా ఎక్కువగా పాజిటివ్ ఉంటుందని ఊరిస్తున్నారు.

రావణుడిని కేవలం సీతను అపహరించిన కోణంలో కాకుండా తనలో ఉన్న వీరత్వం, సంగీత కళ, శివ భక్తి తత్వం, ప్రజలను చక్కగా పాలించిన వైనం లాంటివి చూపించబోతున్నట్టు చెప్పారు. స్వార్థం, పరస్త్రీ మీద వ్యామోహం మనిషి పతనానికి ఎలా దారి తీస్తాయో ఒక పాఠం రూపంలో ప్రేక్షకులకు వివరిస్తామని అంటున్నారు. కెజిఎఫ్, టాక్సిక్ తర్వాత యష్ ఒప్పుకున్న మూవీ ఇదే. రావణుడిగా అయినా సరే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి కారణం నితేశ్ తివారి నేరేషనే.

అయితే రావణుడికి సంబంధించి ఒక గొప్ప క్యారెక్టరైజేషన్ చూపించిన నటుల్లో ముందుగా చెప్పుకోవాల్సింది స్వర్గీయ ఎన్టీఆర్ గురించే. సీతారామకళ్యాణం, భూకైలాస్ లో ఆయన చూపించిన వేరియేషన్లు వాటిని మరపురాని మాస్టర్ పీసెస్ గా చేశాయి. తర్వాత సంపూర్ణ రామాయణంలో ఎస్వి రంగారావు రావణుడిగా ప్రాణ ప్రతిష్ట చేశారు. తర్వాత ఇంకెవరు ఈ స్థాయిలో ప్రభావం చూపించిన నటులు లేరు. ఆదిపురుష్ లో సైఫ్ అలీఖాన్ ని గుర్తు చేసుకోకపోవడం ఉత్తమం.

సో రామాయణ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి పోలికలు వస్తాయి. యష్ లోని అసలైన నటుడిని కూడా ఈ సందర్భంగానే బయటికి తీయొచ్చు. ఒకవేళ ఒకనాటి క్లాసిక్స్ ని గుర్తు చేసే స్థాయిలో కనక యాక్టింగ్ చేయగలిగితే అవార్డులకు ఆకాశమే హద్దు అవుతుంది. నితేశ్ తివారి అంత గొప్పగా పాత్ర చిత్రణ చేశారా లేదానేది ఇక్కడ కీలకం కానుంది. ఏఆర్ రెహమాన్, జిమ్స్ హ్యామర్ సంగీతం సమకూరుస్తున్న ఈ విజువల్ గ్రాండియర్ లో రన్బీర్ కపూర్, సాయిపల్లవి సీతారాములుగా నటిస్తున్నారు.

This post was last modified on April 7, 2026 12:42 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

1 hour ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

3 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

3 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

5 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

5 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

5 hours ago