Political News

శభాష్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నిజమేనండోయ్…కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రోడ్డు ప్రమాదంలో మరణించిన తన కుమారుడు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి సంస్మరణార్థం మంత్రి ఏర్పాటు చేసిన ఓ పాఠశాల ముందు అడ్మిషన్ల కోసం జనం బారులు తీరారు. ఉచితంగా విద్యనందిస్తున్న ఈ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించేందుకు క్యూ కట్టిన జనంతో ఆ పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. చూడటానికి ఇది ప్రైవేట్ స్కూలే గానీ… విద్య మాత్రం ఉచితంగానే అందుతుందట. 

నల్లగొండ నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంకటరెడ్డి… ఓ దఫా భువనగిరి నుంచి ఎంపీగానూ ప్రాతినిధ్యం వహించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్య అనుచరుడిగా పేరున్న వెంకటరెడ్డి… వైఎస్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత తెలుగు నేల విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉండిపోగా… వెంకటరెడ్డి పార్టీని అంటిపెట్టుకుని సాగారు. ఇక రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రాగా.. కోమటిరెడ్డి మరోమారు మంత్రి అయ్యారు. వెంకటరెడ్డి మంత్రిగా ఉన్న సమయంలోనే 2011లో పటాన్ చెరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రతీక్ రెడ్డి చనిపోయారు.

19 ఏళ్ల వయసులోనే చనిపోయిన తన కుమారుడిని గుర్తు చేసుకుంటూ వెంకటరెడ్డి పలు మార్లు కన్నీంటి పర్యంతమయ్యారు. ఈ క్రమంలో తన కుమారుడి పేరు మీదే ఓ ట్రస్టును ఏర్పాటు చేసిన వెంకటరెడ్డి… దాని కింద చాలా కార్యక్రమాలు చేపట్టారు. అందులో పేద, మధ్య తరగతి పిల్లలకు ఉచిత విద్యను అందించేందుకు ఓ ప్రైవేట్ పాఠశాలనూ ఆయన ఏర్పాటు చేశారు. తాజాగా సదరు పాఠశాలను రూ.8 కోట్ల తన సొంత నిధులతో మెరుగులు అద్దారు. 

ఈ పాఠశాలలో కొత్తగా ఏర్పాటు చేసిన సౌకర్యాల విషయానికి వస్తే.. 36 ఏసీ తరగతి గదులు, ఏఐ అధారిత విద్యాబోధన, డిజిటల్ ల్యాబ్స్, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ ఇన్ స్ట్రక్షన్ బోర్డులు, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన క్రీడలు ఉన్నాయి. ఓ కార్పోరేట్ పాఠశాలను తలదన్నే రీతిలో తీర్చిదిద్దబడిన ఈ పాఠశాలలో విద్యను మాత్రం ఉచితంగానే అందిస్తారు. అయితే పేద, మద్య తరగతి కుటుంబాలకు చెందిన వారికే ఈ పాఠశాలలో అడ్మిషన్లు లభిస్తాయట. అందుకే ఈ రెండు వర్గాలకు చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ పాఠశాలలో చేర్పించేందుకు క్యూ కట్టారు. వెంకటరెడ్డి కృషి పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

This post was last modified on April 7, 2026 5:10 pm

Share

Recent Posts

మాస్ ప్రేక్షకులకు ‘ముడి’ వేస్తే చాలు

ఈ వారం విడుదల కాబోతున్న ఇరుముడికి మంచి ఓపెనింగ్ దక్కడం ఖాయం. మాస్ మహారాజా ట్రాక్ రికార్డు పక్కన పెడితే…

21 minutes ago

తెరపైకి దిమాగీ నక్సల్స్ జనతా పార్టీ

దేశంలో కొత్త రాజకీయ వాతావరణం కనిపిస్తుంది. మూస పార్టీలకు భిన్నంగా సరికొత్త ఆన్ లైన్ పార్టీలు పుట్టుకొని వస్తున్నాయి. నిముషాల…

1 hour ago

మేకింగ్ వీడియోలతో కామెడీ చేస్తున్నారా

ఇటీవలే విడుదలైన విశాల్ మకుటం దారుణంగా ఫ్లాప్ అయ్యింది. డిజాస్టర్ అనే మాట చిన్నదే అనిపిస్తుంది కలెక్షన్లు చూస్తే. మొదటి…

1 hour ago

నోలన్‌తో సినిమా… అందులో అతి ఏముంది?

క్రిస్టోఫర్ నోలన్‌తో ఎప్పటికైనా పని చేయాలని ఉందని కుర్ర మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ అనగానే సోషల్ మీడియాలో రకరకాల…

1 hour ago

భారత ఎన్నికల విధానం అమెరికాలో రావాలి: ట్రంప్

అమెరికా ఎన్నికల వ్యవస్థలో ఓటరు గుర్తింపు నిబంధనలను కఠినతరం చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా…

2 hours ago

తండ్రికే ఎదురు తిరిగిన జోగి రాజీవ్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న టైంలో ఆ పార్టీ నేత‌, మాజీ మంత్రి జోగి ర‌మేష్ ఎంత‌గా రెచ్చిపోయారో…

2 hours ago