Movie News

గబ్బర్ గర్వం… ఉస్తాద్ వల్ల మాయం

ఒక పవన్ కళ్యాణ్ సినిమా ఇంత వేగంగా ఫేడవుట్ అవ్వడం ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలోనే జరిగిందని చెప్పాలి. గతంలో అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్లు పవన్ చూసినప్పటికీ కనీసం దాని పేరు మీద కొన్ని ఓపెనింగ్ రికార్డులు ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని సెంటర్లలో వాటి గురించి చెప్పుకుంటారు. కానీ ఉస్తాద్ అందులో సగం కూడా చూపించలేకపోయింది. వంద కోట్ల గ్రాస్ అందుకోలేక త్వరగా సెలవు తీసుకున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఫైనల్ రన్ వారం క్రితమే ముగిసింది.

గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన కాంబోగా దర్శకుడు హరీష్ శంకర్ – హీరో పవన్ కళ్యాణ్ మీద అప్పటిదాకా ఉన్న స్పెషల్ ఇంప్రెషన్, గర్వం మొత్తం ఉస్తాద్ భగత్ సింగ్ తో పోయింది. ముందు నుంచి ఈ ప్రాజెక్టు మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చిన కొందరు అభిమానుల భయాలకు తగ్గట్టే ఫలితం రావడం ట్రాజెడీ. మెయిన్ సెంటర్స్ లో ఇంకా థియేటర్ రన్ కొనసాగుతోంది కానీ నామ మాత్రపు వసూళ్లతో ఏదో మొక్కుబడిగా లాగిస్తున్నారు అంతే.

దురంధర్ ది రివెంజ్ ప్రభావం వల్లే ఇలా జరిగిందని ఎవరైనా సమర్ధించుకునే ప్రయత్నం చేస్తే అంతకన్నా అమాయకత్వం మరొకటి ఉండదు. ఉగాది అడ్వాంటేజ్ వల్ల ఉస్తాద్ కు ఆ మాత్రం కలెక్షన్లు వచ్చాయి కానీ ఇంకో టైంలో వచ్చి ఉంటే నెగటివిటీ, ట్రోలింగ్ ఇంకా ఎక్కువ ఉండేదేమో. హరీష్ శంకర్ విపరీతమైన ప్రమోషన్లు చేసినప్పటికీ అవేవి పని చేయలేదు. ఒక దశ దాటాక ఇక ఆపేయండి సార్ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చెప్పాల్సి వచ్చింది.

ఒక్కటి మాత్రం పవన్ కళ్యాణ్ కు స్పష్టంగా అర్ధమయ్యి ఉంటుంది. కేవలం తాను ఉన్నంత మాత్రాన సినిమా చూసేందుకు జనాలు ఎగబడిపోరు. ఏపీ డిప్యూటీ సిఎంగా పాలనలో తన ముద్ర ఎంత గొప్పగా చూపించినా సినిమాల విషయంలో ప్రేక్షకుల తీర్పు ఎప్పుడు వివక్షలకు అతీతంగా ఉంటుంది. అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ కు పరాజయం తప్పలేదు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయబోయే సినిమా షూటింగ్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందనేది ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది.

This post was last modified on April 6, 2026 11:10 am

Share

Recent Posts

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

1 hour ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

4 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

4 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

5 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

6 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

6 hours ago