Movie News

స్పిరిట్ ఊచకోతకు ‘అనంత’ ఎలివేషన్స్

​పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కలయికలో రాబోతున్న ‘స్పిరిట్’ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ‘యానిమల్’ వంటి భారీ విజయం తర్వాత వంగా చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో, ప్రభాస్ ను ఆయన ఎలా ప్రెజెంట్ చేస్తారనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్రానికి సంబంధించి పాటల రచయిత అనంత శ్రీరామ్ ఇచ్చిన లీక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

​సినిమా అంటే కేవలం యాక్షన్ మాత్రమే కాదు, అందులో బలమైన ఎమోషన్ కూడా ఉండాలని నమ్మే వ్యక్తి సందీప్ వంగా. ‘స్పిరిట్’ కోసం అనంత శ్రీరామ్ ఇప్పటికే రెండు పాటలను పూర్తి చేశారట. ఈ సినిమా ఆల్బమ్ ఒక క్లాసిక్ లా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రభాస్ ను క్లాసిక్ యాంగిల్ లో చూడటం కొంచెం కొత్తగా అనిపించినా, కథలోని సందర్భాలు దానికి తగ్గట్టుగా కుదిరాయని ఆయన వెల్లడించారు. క్లాసిక్ సాంగ్స్ తో పాటు సినిమాలో మాస్ ఆడియన్స్ ఆశించే అసలైన ఊచకోత కూడా ఉంటుందని హింట్ ఇచ్చారు.

​సందీప్ వంగా సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్ చాలా ఇంటెన్స్ గా ఉంటుంది. ‘స్పిరిట్’ లో ప్రభాస్ బాడీ లాంగ్వేజ్, పోలీస్ ఆఫీసర్ గా ఆయన చేసే యాక్షన్ సీక్వెన్స్ లు ఇప్పటివరకు వచ్చిన పోలీస్ సినిమాలకు భిన్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రభాస్ చేసిన యాక్షన్ సినిమాల కంటే ఇందులో ఆవేశం కొంచెం ఎక్కువగానే ఉండొచ్చని అనంత శ్రీరామ్ మాటలను బట్టి అర్థమవుతోంది. కేవలం తన మార్క్ యాక్షన్ తోనే కాకుండా, క్లాసిక్ మ్యూజిక్ తో కూడా ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయడానికి వంగా పక్కా ప్లాన్ తో ఉన్నారు. ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

​ఇక సినిమా షూటింగ్ ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుని, తదుపరి భారీ షెడ్యూల్ కోసం సిద్ధమవుతోంది. ప్రభాస్ కూడా తన లుక్ కోసం ప్రత్యేకంగా కష్టపడుతున్నారు. సందీప్ వంగా సినిమాల్లో విజువల్స్ చాలా నేచురల్ గా, ‘రా’గా ఉంటాయి. ‘స్పిరిట్’ లో కూడా అదే స్టైల్ ను ఫాలో అవుతూ, సినిమాను గ్లోబల్ స్టాండర్డ్స్ లో రూపొందిస్తున్నారు.

​సాధారణంగా పోలీస్ సినిమాలు అంటే కొన్ని రొటీన్ సన్నివేశాలు ఉంటాయి. కానీ వంగా మార్క్ పోలీస్ ఎలా ఉంటాడో ఇప్పటికే ఫ్యాన్స్ ఊహించుకుంటున్నారు. “మీరు కోరుకున్నంత ఊచకోత సినిమాలో ఉంటుంది” అని అనంత శ్రీరామ్ చెప్పడం చూస్తుంటే, ప్రభాస్ లోని అగ్రెసివ్ యాంగిల్ ను వంగా పూర్తిస్థాయిలో వాడుకున్నట్లు కనిపిస్తోంది. యాక్షన్ బ్లాక్స్ లో వైలెన్స్ లెవెల్స్ ‘యానిమల్’ కంటే ఒక రేంజ్ లో ఉంటాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

This post was last modified on April 5, 2026 3:59 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

5 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

7 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

7 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

8 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

8 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

9 hours ago