Movie News

బ్లాక్ బస్టర్ స్ట్రీక్‌కు బ్రేక్ పడబోతోందా?

అనామకుడైన ఒక కుర్రాడు హీరోగా నటించిన తొలి సినిమాతోనే వంద కోట్ల వసూళ్లు రాబట్టడమే అనూహ్యం. అలాంటిది ఆ హీరో తర్వాతి రెండు చిత్రాలు కూడా అదే స్థాయిలో విజయవంతం కావడం ఇంకా ఆశ్చర్యం. తమిళ కుర్రాడు ప్రదీప్ రంగనాథన్ ఈ ఘనతే సాధించాడు. జయం రవి హీరోగా ‘కోమాలి’ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రదీప్.. ఆ సినిమాతో ఓ మోస్తరు ఫలితాన్ని అందుకున్నాడు.

కానీ తర్వాత తనే హీరోగా నటిస్తూ రూపొందించిన ‘లవ్ టుడే’ సినిమాతో ప్రదీప్ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. దీంతో పాటు ప్రదీప్ నటించిన డ్రాగన్, డ్యూడ్ సినిమాలు కూడా వంద కోట్ల క్లబ్బులో అడుగు పెట్టి అతడికి యూత్‌లో మాంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఐతే ఈ టాలెంటెడ్ యాక్టర్ నటించిన కొత్త సినిమా ‘ఎల్ఐకే’ మాత్రం బాగా ఆలస్యం అయింది. అన్ని అడ్డంకులనూ అధిగమించి ఈ నెల 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ట్రైలర్ కూడా లాంచ్ చేశారు.

ఐతే ఇప్పటిదాకా ‘ఎల్ఐకే’ నుంచి రిలీజ్ చేసిన ప్రోమోలేవీ అంత గొప్పగా అనిపించలేదు. ట్రైలర్ కూడా ఎగ్జైటింగ్‌గా లేదు. ఇంకో 15 ఏళ్ల తర్వాత జరిగే కథతో ఈ సినిమాను తీర్చిదిద్దారు. టెక్నాలజీ గొప్పదా.. మనిషి హృదయం గొప్పదా అనే పాయింట్ మీద ఈ సినిమాను నడిపించారు. ప్రదీప్ తీసిన ‘లవ్ టుడే’కు ఇది ఎక్స్‌టెన్షన్‌లాగా అనిపించింది కానీ.. అందులో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఇందులో ఉంటుందా అన్నది సందేహంగానే ఉంది.

దర్శకుడు విఘ్నేష్ శివన్‌కు ఓవర్ రేటెడ్ డైరెక్టర్‌ అనే పేరుంది. ‘నానుమ్ రౌడీ దా’ చిత్రంతో అతను భలేగా ఎంటర్టైన్ చేశాడు. కానీ దాని కంటే ముందు, తర్వాత తీసిన సినిమాలన్నీ తుస్సుమన్నాయి. అతను వన్ ఫిలిం వండర్ అనే ముద్ర పడింది. ‘ఎల్ఐకే’ ట్రైలర్ మీద కూడా మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా సక్సెస్ అయితే ఆశ్చర్యపోవాలనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆలస్యం వల్ల కూడా సినిమా మీద నెగెటివ్ ముద్ర పడింది. ఈ నేపథ్యంలో ప్రదీప్ బ్లాక్ బస్టర్ స్ట్రీక్ కొనసాగడం సందేహంగానే ఉంది.

This post was last modified on April 5, 2026 4:42 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

4 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

6 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

7 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

7 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

7 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

8 hours ago