టాలీవుడ్ మరో మంచి ఫ్రైడే కోసం ఎదురు చూస్తున్న టైంలో కంటెంట్ నమ్ముకున్న రెండు సినిమాలు ఇవాళ థియేటర్లలో అడుగు పెట్టాయి. ఆ నమ్మకంతోనే ముందు రోజు సాయంత్రం నుంచే ప్రీమియర్లు స్టార్ట్ చేశాయి. ప్రాథమికంగా వచ్చిన ఓవర్సీస్, తెలుగు రాష్ట్రాల రిపోర్ట్స్ చూస్తుంటే రెండు నిరాశపరచలేదనే కనిపిస్తోంది. ఆడియన్స్ ఇచ్చే తీర్పు ఎలా ఉండబోతోందో మధ్యానానికి క్లారిటీ వస్తుంది. స్పెషల్ షోలు దాదాపు అన్ని చోట్ల హౌస్ ఫుల్స్ కావడం విశేషం.
ముందు బైకర్ విషయానికి వస్తే జనవరిలో నారి నారి నడుమ మురారితో హిట్టు కొట్టిన శర్వానంద్ ఈసారి ఎవరూ ఊహించని మేకోవర్ తో వచ్చాడు. బైక్ రేసింగ్ కాన్సెప్ట్ కావడంతో ఒంటిని కష్టపెట్టుకుని, బరువు తగ్గి చాలా డెడికేషన్ ఇచ్చాడు. ట్రైలర్ లోనే అవి బయటపడ్డాయి. రాజశేఖర్ మొదటిసారి హీరో తండ్రి పాత్రకు ఎస్ చెప్పడం అంచనాల పరంగా ప్లస్ అయ్యింది. రేసింగ్ కాన్సెప్ట్ తో పాటు ఫాదర్ సన్ ఎమోషన్ మెయిన్ హైలైట్స్ లో ఒకటిగా చెబుతున్నారు.
నీహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరించిన రాకాసకు ప్రమోషన్లు పెద్ద ప్లస్ అయ్యాయి. రామ్ చరణ్ తో చేసిన పదకొండు నిమిషాల ఇంటర్వ్యూ బజ్ పెరగడానికి ఉపయోగపడింది. సంగీత్ శోభన్ టైమింగ్ మీద ఆడియన్స్ లో అంచనాలు ఉండటం, లేడీ డైరెక్టర్ మానస శర్మ ప్రమోట్ చేసుకున్న విధానం జనంలో సాఫ్ట్ కార్నర్ వచ్చేలా చేశాయి. విఎఫ్ఎక్స్, ట్విస్టులు, ఆర్టిస్టుల టైమింగ్ మీద ఫీడ్ బ్యాక్ అయితే పాజిటివ్ గా ఉంది. సోషల్ మీడియా సపోర్ట్ బానే ఉంది.
ఇవాళ కనక రెండు సినిమాలు పాస్ అయితే బాక్సాఫిస్ కు మంచి ఊపు వస్తుంది. మార్చిలో దురంధర్ ది రివెంజ్ ఒక్కటే వసూళ్లు తేగా ఉస్తాద్ భగత్ సింగ్ నిరాశపరిచింది. సరైన ఫీడింగ్ లేక వేసవి వృధా అయిపోతోందని కలవపడుతున్న ట్రేడ్ వర్గాలకు రాకాస, బైకర్ సక్సెస్ కావడం చాలా అవసరం. సముతిరఖని తమిళ డబ్బింగ్ కార్మేని సెల్వం కూడా ఈ రోజే ఆడియన్స్ ముందుకు వచ్చింది కానీ టైటిల్, వీక్ ప్రమోషన్ల వల్ల జనాలను చేరలేకపోతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
