Movie News

దురంధర్ 2 మూడో వేట మొదలు

మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై శాతానికి పైగా డ్రాప్ ఉండటంతో టెన్షన్ పడిన మాట వాస్తవమే. అయితే ఇది తాత్కాలికమే. గుడ్ ఫ్రైడే నుంచి దురంధర్ మళ్ళీ ఊపందుకుంది. బుక్ మై షోలో సగటున గంటకు 22 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోతూ మళ్ళీ టాప్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఇది క్రమంగా పెరగడమే కానీ తరగడం ఉండదు.

ప్రస్తుతం పదిహేను వందల కోట్లు దాటేందుకు పరుగులు పెడుతున్న దురంధర్ 2 అందరూ కోరుకున్నట్టు రెండు వేల కోట్లను చేరుకుంటుందా లేదానే దాని మీద బయ్యర్ వర్గాలు ఒక అంచనాకు రాలేకపోతున్నాయి. ఎందుకంటే మొదటి భాగంలాగా అన్ని రోజులు ఒకేలా పార్ట్ 2 హోల్డ్ చేయలేకపోతోంది. నెంబర్లలో అది స్పష్టంగా కనిపిస్తోంది. పైగా రిపీట్ ఆడియన్స్ దాని స్థాయిలో లేరు. నాలుగు గంటల నిడివి ఒక కారణంగా చెప్పొచ్చు.

ఇలాంటి ప్రతికూలతలు కొన్ని ఉన్నప్పటికీ దురంధర్ రివెంజ్ దూకుడు మార్చి నెల బాక్సాఫీస్ కు ఆక్సిజన్ లా పని చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి స్టార్ హీరో సినిమాను డామినేట్ చేయడం అంటే మాటలు కాదు. పవన్ కళ్యాణ్ మూవీకి హిట్ టాక్ వచ్చి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది కానీ రణ్వీర్ సింగ్ కు ఆ అంశం కలిసి వచ్చింది. ఏ సెంటర్స్ లో దురంధర్ హోల్డ్ చాలా బాగుంది. మెయిన్ స్క్రీన్లు సగానికి పైగా నిండుతున్నాయి.

ఏప్రిల్ 10 విడుదల కావాల్సిన అక్షయ్ కుమార్ భూత్ బంగ్లా వారం రోజులు ఆలస్యంగా వాయిదా వేసుకుంది. కారణం దురంధరని మళ్ళీ చెప్పనక్కరలేదు. అడివి శేష్ డెకాయిట్ మాత్రం ఆలోచించడం లేదు. అదే డేట్ కి ప్యాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కు రెడీ అయిపోతోంది. ఎలాగూ అప్పటికంతా దురంధర్ నెమ్మదించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి డెకాయిట్ కనక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఏపీ తెలంగాణ వరకు ఈజీగా దూసుకుపోవచ్చు. రేపు వస్తున్న బైకర్, రాకాస హిట్టయినా ఇబ్బంది ఉండదు.

This post was last modified on April 2, 2026 9:12 pm

Share

Recent Posts

చిరంజీవి చూపు ఎవరి మీద ఉంది

కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…

3 hours ago

ట్రంప్‌.. ప్ర‌జాద‌ర‌ణ ఢ‌మాల్‌.. దేశ చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైమ్‌!

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. వాస్త‌వానికి గ‌త ఏడాదే ఆయ‌న ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గుముఖం…

3 hours ago

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

5 hours ago

రాజమౌళిని ఫాలో అవుతున్న రణబాలి

సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్…

5 hours ago

దాదాకున్న సమయం తక్కువే కానీ

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…

5 hours ago

రణబాలి… దర్శకుడి క్లారిటీ సూపర్

ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…

7 hours ago