బాలకృష్ణ ఖాకీ డ్రెస్సు వేస్తే బ్లాక్ బస్టర్ ఖాయమనేది అభిమానుల నమ్మకం. దానికి పునాది వేసింది రౌడీ ఇన్‌స్పెక్టర్. 1992లో విడుదలైన ఈ సూపర్ హిట్ మూవీ అప్పట్లో అభిమానులనే కాదు మాస్ ప్రేక్షకులను కూడా ఊపేసింది. దీని స్ఫూర్తితోనే దర్శకుడు వైవిఎస్ చౌదరి తర్వాతి కాలంలో హరికృష్ణని హీరోగా చేసి సీతయ్యతో శభాష్ అనిపించుకున్నారు. బాలయ్య లక్ష్మి నరసింహ రూపంలో మరో విజయం తన ఖాతాలో వేసుకున్నారు భగవంత్ కేసరిలో ఖాకీ దుస్తులు వేసింది కాసేపే.
త్వరలోనే బాలకృష్ణ పూర్తి స్థాయి పోలీస్ ఆఫీసర్ ఆ కనిపించబోతున్నట్టు ఫిలిం నగర్ టాక్. నాంది, ఉగ్రం ఫేమ్ విజయ్ కనకమేడల చెప్పిన కథ బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వినికిడి. ఒక టాలీవుడ్ అగ్రనిర్మాత పెద్ద బడ్జెట్ తో దీన్ని నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. విజయ్ కనకమేడల రాసుకునే కథల్లో సందేశం ఉంటుంది. దానికి బాలయ్య మార్కు హీరోయిజం తోడైతే అవుట్ ఫుట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. కాకపోతే సమర్ధవంతంగా హ్యాండిల్ చేయాలి.
అంతర్గత వర్గాల ప్రకారం కొన్నేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఒక నిజ జీవిత సంఘటనను ఆధారంగా చేసుకుని విజయ్ కనకమేడల ఈ స్క్రిప్ట్ సిద్ధం చేశారట. రెగ్యులర్ కమర్షియల్ అంశాలు మిస్ కాకుండా సమాజాన్ని ప్రశ్నించే రీతిలో చాలా బాగా వచ్చిందని అంటున్నారు. భారతీయుడు, ఠాగూర్ లో ఎలా అయితే మాస్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా మెసేజ్ ఇచ్చారో అదే తరహాలో ఇది కూడా ఉంటుందని అంటున్నారు.
దీని సంగతి ఆలా ఉంచితే ప్రస్తుతం గోపీచంద్ మలినేని సినిమా వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్న బాలయ్య నెక్స్ట్ వివేక్ ఆత్రేయకు ఎస్ చెప్పిన వార్త తెగ తిరుగుతోంది కానీ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఏది ముందు మొదలవుతుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. మలినేని మూవీని దీపావళి లేదా డిసెంబర్ లో విడుదల చేసే ప్లానింగ్ ఉంది. ఒకవేళ మిస్ అయితే మటుకు బాలయ్య 2027 సంక్రాంతికి ఆల్రెడీ పోటీలో ఉన్న నలుగురైదుగురు హీరోలకు కాంపిటీషన్ అవుతారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
