ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ డేట్ కోసం అప్పుడే పోటీలు పడుతూ డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడుతున్న వైనం తెరవెనుక జరుగుతోంది. ఒకవేళ పెద్ది వాయిదా లేకపోతే ఈపాటికి మూడో పాట, వేరే ప్రమోషనల్ మెటీరియల్ బయటికి రావాలి కదానేది మెగా ఫ్యాన్స్ ప్రశ్న. ఇదిలా కొనసాగుతూ ఉండగానే రాకాస టీమ్ ప్రమోషన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్ పెద్ద షాక్ ఇచ్చాడు.
బయట చాలా వింటున్నానని కానీ పెద్ది ఆన్ టైం వస్తుందని, మీరు కూడా చెప్పండని సంగీత్ శోభన్, నీహారికలను ఉద్దేశించి చెప్పడం ఒక్కసారిగా సోషల్ మీడియాని కుదిపేసింది. అంటే పెద్ది ఏప్రిల్ 30 రావడం పక్కా అని అభిమానులు అప్పటికప్పుడు ట్వీట్ల వర్షం మొదలుపెట్టేశారు. ట్విస్ట్ ఏంటంటే చరణ్ ఆన్ టైం అన్నాడు కానీ డేట్ చెప్పలేదు. ఖచ్చితంగా అదే తేదీకి వస్తుందని నొక్కి వక్కాణించలేదు. ఆలస్యం ఉండదని అన్నాడు.
సరే ఒకవేళ పెద్ది నిజంగానే ఏప్రిల్ 30 వస్తే అంత కన్నా గుడ్ న్యూస్ ఏముంటుంది. ట్రేడ్ వర్గాలు పండగ చేసుకుంటాయి. అసలే పుష్ప 2 రేంజ్ లో రేట్లు పలుకుతున్న నేపథ్యంలో ఆకాశమే హద్దుగా హైప్ అంతకంతా పెరుగుతోంది. లేదూ వచ్చే ఛాన్స్ లేదనుకుంటే చరణ్ మాటల్లో మర్మం ఏమిటో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. లేట్ అవ్వదు అంటే మే నెలలో గ్యారెంటీగా వస్తుందని అనుకోవాలేమో. ఏది ఏమైనా ఈ కన్ఫ్యూజన్ ఇంకొన్ని రోజులు ఉంటుంది.
ఇవన్నీ పక్కనపెడితే ముందు పెద్ది స్పెషల్ సాంగ్ షూట్ చేయాలి. ఏఆర్ రెహమాన్ రీ రికార్డింగ్ మూడో వారంకల్లా అయిపోగొట్టాలి. నార్త్ పబ్లిసిటీ కోసం టీమ్ ముంబై లాంటి నగరాలకు వెళ్లాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రచారాన్ని ఉదృతం చేయాలి. చరణ్ చాలా కష్టపడి చేసిన ప్రాజెక్టు కావడంతో పాటు గేమ్ ఛేంజర్ చేసిన గాయాన్ని పూర్తిగా మాయం చేసే మూవీగా దీని మీద మాములుగా అంచనాలు లేవు. ముందైతే ట్రైలర్ ఎప్పుడో ఆ శుభవార్త చెప్పమని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
This post was last modified on April 1, 2026 9:53 pm
ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…
మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…
ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…