Movie News

కల్కి 2… సుప్రీమ్ బలాన్ని పెంచుతున్న నాగ్ అశ్విన్?

ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన ప్రభావాన్ని ఎవరూ మర్చిపోలేరు. మొదటి భాగం ముగిసిన తీరు చూశాక, సహజంగానే పార్ట్ 2 మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం హైదరాబాద్‌ లో ఈ సీక్వెల్‌ కు సంబంధించిన షూటింగ్ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ రెండో భాగంలో కథను మరింత స్ట్రాంగ్ గా మార్చేందుకు దర్శకుడు నాగ్ అశ్విన్ కొత్త పాత్రలను రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది.

ఈ మధ్యే జరిగిన షెడ్యూల్‌ లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ మధ్య వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను మేకర్స్ చిత్రీకరించినట్లు సమాచారం. వీరు కాకుండా సినిమాలో మరో నెగిటివ్ రోల్ ఉండబోతోందనే టాక్ ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మొదటి భాగంలో సుప్రీం యాస్కిన్ పాత్రను చాలా పవర్‌ఫుల్ గా చూపించారు. దానికి తోడుగా ఇప్పుడు మరో క్రూరమైన విలన్ పాత్రను ప్రవేశపెట్టాలని నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నారట. ఈ పాత్ర కోసం ఒక ప్రముఖ బాలీవుడ్ నటుడిని సంప్రదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

జేడీ చక్రవర్తి ఈ సినిమాలో నటిస్తున్నారని గతంలో కొన్ని రూమర్లు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని తేలిపోయింది. ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం, కమల్ హాసన్ కి కుడిభుజంలా ఉండే మరో విలన్ పాత్ర ఇందులో ఉండబోతోందట. ఆ పాత్రకు బాలీవుడ్ నుంచి ఒక స్టార్ యాక్టర్‌ని తీసుకుంటే సినిమాకు నార్త్ ఇండియాలో కూడా మంచి క్రేజ్ వస్తుందని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ నటుడు ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది.

మొదటి భాగంలో కర్ణుడి పాత్రకు ఇచ్చిన ఇంపార్టెన్స్ వల్ల రెండో భాగం మొత్తం ఆ పాత్ర చుట్టూనే తిరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నెగిటివ్ రోల్స్ కూడా అంతే బలంగా ఉంటేనే హీరో ఎలివేషన్లు పండుతాయని నాగ్ అశ్విన్ నమ్ముతున్నారు. విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ ఎపిసోడ్లు ఈసారి మొదటి భాగం కంటే రెట్టింపు స్థాయిలో ఉండేలా స్క్రిప్ట్ సిద్ధం చేశారట. ముఖ్యంగా ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో పాటు పురాణాలను జోడించి ఈ కొత్త నెగిటివ్ పాత్రను డిజైన్ చేసినట్లు టాక్.

వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్‌ తో ఈ ప్రాజెక్ట్‌ ను నిర్మిస్తోంది. ఇప్పటికే ఉన్న కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజాలకు తోడు ఇప్పుడు మరో బాలీవుడ్ స్టార్ కూడా తోడైతే కల్కి సీక్వెల్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అయితే చిత్ర యూనిట్ నుంచి దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రభాస్ కూడా త్వరలోనే సెట్స్ లో జాయిన్ కాబోతుండటంతో అప్పటికి ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.

This post was last modified on March 31, 2026 3:03 pm

Share

Recent Posts

సైలెంటుగా వ‌చ్చి ఇండ‌స్ట్రీ హిట్ కొట్టేసింది

నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమ‌మ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన న‌టుడు. ఆ…

15 minutes ago

ముఖ్యమంత్రి పదవికి దీప్కే రాజీనామా

అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…

4 hours ago

కొండా సురేఖకు కేబినెట్ హోదా?

తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…

6 hours ago

ఇరుముడి న‌టుడు… రోజుకు 40 వేలు

హీరో హీరోయిన్ల‌కు.. పెద్ద టెక్నీషియ‌న్ల‌కు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోష‌కాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేసేవాళ్ల‌కు…

6 hours ago

నాలుగు స్థంభాలాటలో విజేత ఎవరంట

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…

7 hours ago

కీర్తి సురేష్ ఇంత హాటైపోయిందేంటబ్బా..

మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…

8 hours ago