Movie News

అబ్బవరం లెవెల్ మారుతోంది

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ రంగంలో అడుగు పెట్టి.. హీరోగా ఒక స్థాయి అందుకోవడం తేలికైన విషయం కాదు. చాలా కొద్ది మందే ఇలా ఎదుగుతారు. కిరణ్ అబ్బవరం అందులో ఒకడు. ‘రాజావారు రాణివారు’ అనే చిన్న సినిమాతో హీరోగా పరిచయం అయి.. ‘ఎస్‌ఆర్ కళ్యాణమండపం’తో మంచి గుర్తింపు, కొంతమేర ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు ఈ కడప కుర్రాడు. ఆ తర్వాత అతడికి అవకాశాలు వరుస కట్టగా.. సరైన సినిమాలు ఎంచుకోకపోవడంతో కెరీర్ మధ్యలో గాడి తప్పింది. 

కానీ ‘క’ మూవీతో అతను బలంగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఆపై ‘దిల్ రుబా’ నిరాశపరిచినా.. ‘కే ర్యాంప్’తో తన ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్‌ను బలపరుచుకున్నాడు. ఐతే ఇప్పటిదాకా కిరణ్ చేసిన సినిమాలు ఒకెత్తయితే.. ఇకపై తన నుంచి రాబోయేవి మరో ఎత్తులా కనిపిస్తున్నాయి. రాబోయే రెండేళ్లలో కిరణ్ నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లబోయే సంకేతాలు కనిపిస్తున్నాయి. తన చేతిలో ఉన్న ప్రాజెక్టులు అంత ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నాయి.

‘బేబీ’ దర్శక నిర్మాత సాయి రాజేష్ స్క్రిప్టుతో ఆయన నిర్మాణంలోనే తెరకెక్కుతున్న ‘చెన్నై లవ్ స్టోరీ’పై మంచి అంచనాలున్నాయి. ఈ సినిమా ‘బేబీ’ లాగే సెన్సేషన్ క్రియేట్ చేయగలదని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. శ్రీ గౌరీ ప్రియకు తమిళంలో మంచి ఫాలోయింగ్ ఉండడం కలిసొచ్చే అంశం. మరోవైపు కిరణ్.. ‘డియర్ కామ్రేడ్’ దర్శకుడు భరత్ కమ్మతో ‘గువ్వలచెరువు ఘాట్’ అనే వెబ్ సిరీస్ చేశాడు. ఇటీవలే రిలీజైన దాని గ్లింప్స్ భలేగా అనిపించింది. దాన్ని పాన్ ఇండియా స్థాయిలో స్ట్రీమ్ చేయబోతోంది అమేజాన్ ప్రైమ్. 

ఇవి కాక సుకుమార్ అసిస్టెంట్ అయిన వీర కోగటం దర్శకత్వంలో రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఒక యాక్షన్ థ్రిల్లర్‌ను లైన్లో పెట్టాడు కిరణ్. ఇది సుకుమార్ ఆమోదించిన స్క్రిప్టు. ఆయన అన్న కొడుకు అశోక్, మంచి జడ్జిమెంట్ ఉన్న వంశీ నందిపాటి కలిసి నిర్మించబోతున్నారీ సినిమాను. ఈ ఏడాది ద్వితీయార్ధంలో సెట్స్ మీదికి వెళ్లనున్న ఈ సినిమా మీదా కిరణ్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు.

ఈ మూడు చిత్రాలతో కిరణ్ రేంజ్ మారిపోతుందన్నది ఆయనతో పాటు సన్నిహిత వర్గాల మాట. ఇవి కాక స్వీయ దర్శకత్వంలో కిరణ్ ఓ సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నాడు. చూస్తుంటే వచ్చే రెండు మూడేళ్లలో కిరణ్ మిడ్ రేంజ్ స్టార్లలో ఒకడిగా ఎదిగేలా కనిపిస్తున్నాడు.

This post was last modified on March 29, 2026 11:28 pm

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

5 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

5 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

5 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

5 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

7 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

7 hours ago