Movie News

వాయిదాల సినిమాలకు ఎట్టకేలకు మోక్షం

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ.. షార్ట్‌గా చెప్పాలంటే ‘ఎల్‌ఐకే’.. తమిళంలో రెండేళ్ల ముందు మొదలైన సినిమా. ‘లవ్ టుడే’తో సెన్సేషన్ క్రియేట్ చేశాక ప్రదీప్ రంగనాథన్‌ను హీరోగా పెట్టి ఈ సినిమాను పట్టాలెక్కించాడు నయనతార భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్. ఈ చిత్రానికి నయనతారనే నిర్మాత కావడం విశేషం. ‘ఉప్పెన’తో తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు సంపాదించిన కృతి శెట్టి.. తమిళంలో ఈ చిత్రంతోనే అరంగేట్రం చేయాల్సింది. కానీ ఈ సినిమా విడుదల ఆలస్యం అయింది.

గత ఏడాది దీపావళికే రావాల్సిన సినిమా.. వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. సమ్మర్లో అయినా రిలీజవుతుందా లేదా అని సందేహాలు కలుగుతున్న సమయంలో.. సడెన్‌గా రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న విడుదల చేయబోతున్నట్లు హీరో ప్రదీప్ ఎక్స్‌ పోస్టు ద్వారా వెల్లడించాడు. ఈ పోస్టులో రిలీజ్ డేట్ చెప్పి.. ‘ట్రస్ట్ మి బ్రో’ అని అతను కామెంట్ పెట్టడం విశేషం.

ఇలా ఎన్నోసార్లు డేట్ ఇచ్చి సినిమాను వాయిదా వేసిన నేపథ్యంలో ఏప్రిల్ 10న అయినా సినిమా వస్తుందా అని సందేహాలు వ్యక్తం కావడం సహజం. అందుకే ఈసారి తనను నమ్మమంటూ ఆ కామెంట్ జోడించాడు ప్రదీప్. లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ చిత్రాలతో వరుసగా మూడు వంద కోట్ల సినిమాలు ఇచ్చిన ప్రదీప్ నుంచి వస్తున్న సినిమా అంటే అంచనాలు భారీగా ఉంటాయి. పైగా ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.

నయన్ నిర్మాతగా వ్యవహరించింది. ఇవన్నీ ‘ఎల్‌ఐకే’కు ఎంతో కలిసొచ్చే విషయాలే. కానీ వాయిదాల పర్వం వల్ల సినిమాకు బజ్ తగ్గింది. ఇంకా ఆలస్యం అయితే సినిమా మీద పూర్తిగా ఆశలు కోల్పోవాల్సి వచ్చేది. కానీ ఎట్టకేలకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఒక విభిన్న కథాంశంతో విఘ్నేష్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమా బడ్జెట్ రూ.60 కోట్లకు పైనే కావడం గమనార్హం.

This post was last modified on March 30, 2026 4:24 pm

Share

Recent Posts

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

1 hour ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

2 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

3 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

9 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

11 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

12 hours ago