Movie News

చరణ్ మాట కోసం నిఖిల్ వెయిటింగ్?

నిఖిల్ ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు విడుదల తేదీ ఇప్పటిదాకా ఖరారు కాలేదు. ముందు ఫిబ్రవరి అన్నారు. తర్వాత డ్రాప్ అయ్యారు. ఏప్రిల్ 10 అనుకున్నారు. కానీ అడివి శేష్ డెకాయిట్ ఉండటంతో పాటు ఇతరత్రా కారణాల వల్ల ఆగిపోయారు. ఒకవేళ ఏప్రిల్ 17 వస్తుందేమోనని అభిమానులు ఎదురు చూశారు కానీ ఆ అనౌన్స్ మెంట్ కూడా లేదు. అయితే నిఖిల్ బృందం ఎదురు చూస్తోంది రామ్ చరణ్ టీమ్ తీసుకుబోయే నిర్ణయం కోసమని ఇన్ సైడ్ టాక్.

ఈ క్షణం వరకు పెద్ది విడుదల తేదీ ఏప్రిల్ 30 అని బుచ్చిబాబు, నిర్మాతలు నొక్కి వక్కాణిస్తూ వచ్చారు. కానీ ఎప్పటికప్పుడు అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే టాలీవుడ్ లో ప్యాన్ ఇండియా మూవీస్ చెప్పిన మాట మీద నిలబడే పరిస్థితులు లేవు. అందులోనూ ఇంకా ఐటెం సాంగ్ షూట్, రీ రికార్డింగ్ పెద్ది వైపు నుంచి బాలన్స్ ఉన్నాయి. ప్రమోషన్లు మొదలుపెట్టనే లేదు. నార్త్ ఇండియా హక్కులు జియో స్టూడియోస్ కొనేశాక పబ్లిసిటీ ఉత్తరాది రాష్ట్రాల్లో ఘనంగా చేయాల్సి ఉంటుంది.

సో చివరి నిమిషంలో ట్విస్టు ఇస్తూ పెద్ది కనక పోస్టుపోన్ అయ్యే పక్షంలో క్షణం ఆలోచించకుండా ఏప్రిల్ 30కి స్వయంభు దింపాలనేది నిర్మాతల ఆలోచనగా తెలుస్తోంది. అధికారిక ప్రకటనలు వచ్చేవరకు ఏదీ ఖరారుగా చెప్పలేం కానీ మొత్తానికి వీటికి సంబంధించిన హాట్ డిస్కషన్స్ అయితే అంతర్గతంగా జరుగుతున్న మాట వాస్తవం. ఒకవేళ పెద్ది ఓవర్సీస్ బుకింగ్స్ ఏప్రిల్ 8 మొదలుకాకపోతే మటుకు వాయిదా గురించి ఎలాంటి సందేహం పెట్టుకోనక్కర్లేదు.

స్వయంభు మీద నిఖిల్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. పట్టుబట్టి సోలో రిలీజ్ కోసం కంకణం కట్టుకున్నాడు. పెద్ది కనక ఛాన్స్ ఇస్తే దాన్ని వాడుకోవడానికి అన్ని రకాలుగా రెడీగా ఉన్నాడు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించిన స్వయంభులో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. బడ్జెట్ భారీగానే ఖర్చయ్యింది. రికవరీ మీద ప్రొడ్యూసర్లు ధీమాగా ఉన్నారు. కంటెంట్ ఆ స్థాయిలో వచ్చిందని అంటున్నారు. చూడాలి మరి చివరికి ఏ డెసిషన్ తీసుకుంటారో.

This post was last modified on March 29, 2026 10:45 pm

Share

Recent Posts

మంచి ఆలోచన చేసిన రణబాలి

దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…

2 hours ago

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

10 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

10 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

10 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

10 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

12 hours ago