ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్న బాలకృష్ణ తర్వాత ఎవరితో చేస్తారనే దాని మీద రకరకాల టాక్స్ ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో దర్శకుడు వివేక్ ఆత్రేయ ప్రాజెక్టు దాదాపు ఓకే అయినట్టే. కాకపోతే అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇంకా రాలేదు. వీరసింహారెడ్డి నిర్మాణ సంస్థ కావడంతో బాలయ్య ముందు నుంచి ఈ ప్రతిపాదన మీద సానుకూలంగా ఉన్నారు. స్టోరీ సరికొత్త లైన్ తో చాలా డిఫరెంట్ గా వచ్చిందని వినికిడి.
అల్లరి నరేష్ నాందితో పేరు తెచ్చుకున్న విజయ్ కనకమేడల చెప్పిన కథ ఒకటి బాలయ్యకు నచ్చిందట. సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. బడ్జెట్ పరంగా ఇదే వేగంగా పూర్తయ్యే ఛాన్స్ ఉండటంతో ఏదో ఫస్ట్ ఏది నెక్స్ట్ అనే దాని మీద బాలకృష్ణ ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ప్రస్తుతం మలినేని షూటింగ్ లో బిజీగా ఉండటంతో కొంచెం టైం తీసుకుని నిర్ణయం చెబుతానని అన్నారట. అప్పటిదాకా వెయిట్ చేయాలి.
ఇక హరీష్ శంకర్ కూడా ఈ జాబితాలో ఉన్నట్టు మరో టాక్ ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ ఆశించిన ఫలితం ఇవ్వలేకపోవడంతో ఈసారి ఎవరితో చేస్తారనే దాని మీద ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనికన్నా ముందు హరీష్ శంకర్ పలుమార్లు రామ్ ని ట్రై చేసినట్టు ప్రచారం జరిగింది. కథ విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో అది ప్రపోజల్ స్టేజి దాటి ముందుకు వెళ్ళలేదు. సో బాలయ్యతో మూవీ ఉంటుందా లేదానేది ఇంకొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది.
అఖండ 2 ఫెయిల్యూర్ తర్వాత బాలకృష్ణ మరింత జాగ్రత్తగా ఉంటున్నారు. మలినేని ముందు రాసుకున్న హిస్టారికల్ సబ్జెక్టు పక్కనపెట్టి కమర్షియల్ మూవీ వైపు షిఫ్ట్ అయిపోయారు. హీరోయిన్ నయనతార కాగా రెండో కథానాయికగా డింపుల్ హయతి దాదాపు ఫిక్స్ అయ్యింది. వీలైతే ఈ ఏడాది దసరా లేదా దీపావళి విడుదలకు టార్గెట్ చేస్తున్నారు. మిస్ అయితే మాత్రం 2027 సంక్రాంతి తప్ప వేరే ఆప్షన్ ఉండదు. ఇప్పటికైతే విడుదల గురించి ఏ ఆలోచనా చేయడం లేదట.
Gulte Telugu Telugu Political and Movie News Updates