మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు ఎలాంటి కంటెంట్ ఇస్తాడోనని విపరీతమైన ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూసిన అభిమానులకు పెద్ద కానుకే దక్కింది. కేవలం నిమిషంలోపే వీడియో అయినా గూస్ బంప్స్ అనిపించే విజువల్స్ తో ట్రీట్ ఇచ్చేశారు. కండలు తిరిగిన హల్క్ బాడీతో చరణ్ ఫైట్ చేయడం, వర్షంలో గద పట్టుకుని నిలుచోవడం, పరుగులు పెట్టడం ఒకదాన్ని మించి మరొకటి అసలిది పెద్ది టీజరేనా లేక ఇంకో సినిమానా అనిపించేలా ఉన్నాయి.
ఇప్పటిదాకా పెద్దికి సంబంధించిన ప్రమోషనల్ మెటీరియల్ అంతా క్రికెట్ చుట్టే తిరిగింది. దాంతో ప్రేక్షకులు ఇది ఆ క్రీడతోనే ముడిపడిన సబ్జెక్టు అనుకున్నారు. కానీ బుచ్చిబాబు లెక్కలు వేరే ఉన్నాయి. ఇందులో చరణ్ పాత్ర ఆట కూలి. అంటే డబ్బులు వస్తాయంటే ప్రాణాలకు తెగించి మరీ అన్ని ఆటలకు రెడీ అయిపోతాడు. కుస్తీకి కూడా అందుకే సై అంటాడు. అసలు ఎందుకు ఇన్ని ఆడాడో తెలియాలంటే మాత్రం ఏప్రిల్ 30 దాకా ఆగాలి.
గేమ్ ఛేంజర్ డిజాస్టర్ తర్వాత ఎలాంటి కంబ్యాక్ అవసరమో దానికి మించిన అవుట్ ఫుట్ తో రామ్ చరణ్ ఆశ్చర్యపరుస్తున్నాడు. దీని వెనుక బుచ్చిబాబు కష్టం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈసారి లౌడ్ గా లేదు. సెటిల్డ్ గా ఇచ్చారు. చరణ్ డామినేషన్ ఆ స్థాయిలో ఉన్నప్పుడు బీజీఎమ్ ని అండర్ ప్లే చేయడమే కరెక్ట్. అయితే ఫ్యాన్స్ కొందరు రెహమానే కంపోజ్ చేసిన మెర్సల్ మ్యూజిక్ ని జోడించి వైరల్ చేస్తున్నారు.
పెద్ది విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదు. ఏప్రిల్ 30 డేట్ మరోసారి కన్ఫర్మ్ చేస్తూ టీజర్ చివర్లో క్లారిటీ ఇచ్చారు. వాయిదా పడుతుందనే పుకార్లు గట్టిగా తిరుగుతున్న నేపథ్యంలో అలాంటివి ఏమి లేవని తేల్చి చెప్పేశారు. ఇంకో నెల రోజులు మాత్రమే టైం ఉండటంతో పబ్లిసిటీ వేగాన్ని పెంచబోతున్నారు. జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్, జగపతిబాబు లాంటి క్రేజీ క్యాస్టింగ్ తో పెద్ది మీద అంచనాలు అంతకంతా పెరుగుతున్నాయి. హిందీలో జియో స్టూడియోస్ పంపిణి చేయొచ్చని ట్రేడ్ టాక్.
Gulte Telugu Telugu Political and Movie News Updates