నేటి తరం కుర్ర హీరోల్లో సంతోష్ శోభన్, సంగీత్ శోభన్ సోదరులకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే వీరిద్దరి కెరీర్ వెనుక ఒక పెద్ద చేయి ఉందన్నది కాదనలేని సత్యం.. ఆ చేయి మరెవరిదో కాదు సాక్షాత్తూ రెబల్ స్టార్ ప్రభాస్‌ది. మొదటి నుంచి సంతోష్ శోభన్ కెరీర్ కు ప్రభాస్ గట్టి సపోర్ట్ ఇస్తూనే ఉన్నాడు. యూవీ క్రియేషన్స్ లో వరుసగా సినిమా ఛాన్సులు ఇప్పించడమే కాకుండా, తనకు క్లోజ్ గా ఉండే ఇతర నిర్మాతలకు కూడా వీరిని సజెస్ట్ చేసేవాడు. డార్లింగ్ ఇచ్చిన ఆ పుష్ అటు సంతోష్ కి, ఇటు తమ్ముడు సంగీత్ కి కూడా బాగా కలిసొచ్చింది.
ముఖ్యంగా సంగీత్ శోభన్ కు కెరీర్ మొదట్లోనే ‘మ్యాడ్’, ‘మ్యాడ్ 2’ వంటి హిట్లు పడటంతో అతను వెంటనే ట్రాక్ లో పడిపోయాడు. ఇప్పుడు ‘రాకస’ అనే థ్రిల్లర్ తో ఆడియన్స్ ను థ్రిల్ చేయడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమా ఏప్రిల్ 3న రిలీజ్ కానున్న నేపథ్యంలో, రీసెంట్ ఇంటర్వ్యూలో సంగీత్ ప్రభాస్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శోభన్ దర్శకత్వంలో వచ్చిన ‘వర్షం’ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది కాబట్టే ప్రభాస్ వారి కొడుకులను ఇంతలా సపోర్ట్ చేస్తున్నారని చాలామంది అనుకుంటారు. కానీ సంగీత్ శోభన్ మాత్రం అది కానే కాదంటున్నాడు.
ఒకవేళ ‘వర్షం’ సినిమా డిజాస్టర్ అయ్యి ఉన్నా సరే, ప్రభాస్ తమను ఇలాగే ఎంకరేజ్ చేసేవారని గట్టిగా చెబుతున్నాడు. ఎందుకంటే ప్రభాస్ క్యారెక్టర్ అలాంటిదని, తనని నమ్మిన వారిని లేదా తన వాళ్లు అనుకున్న వారిని ఆయన ఎప్పుడూ వదిలిపెట్టరని సంగీత్ క్లారిటీ ఇచ్చాడు.
సంగీత్ చెప్పిన ఆ మాటలను బట్టి చూస్తే ప్రభాస్ వారిపై ఎంత ఆప్యాయత చూపించాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిజానికి ఇతని అన్న సంతోష్ శోభన్ హీరోగా 2015లోనే కెరీర్ ని స్టార్ట్ చేశాడు. ఇన్నేళ్ళలో 10 సినిమాలు చేస్తే మొన్న వచ్చిన కపుల్ ఫ్రెండ్లితో కమర్షియల్ గా హిట్ కొట్టాడు. సక్సెస్ రాకున్నా ప్రభాస్ అతన్ని వదల్లేదు. మొత్తానికి హిట్టు కొట్టే వరకు అవకాశాలు వచ్చేలా చేశాడు. ఇక సంగీత్ మాత్రం ప్రభాస్ కు పని చెప్పకుండానే తనదైన కామెడీ ట్రాక్ లో ఆఫర్లు అయితే అందుకుంటున్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates