‘బాహుబలి’ సినిమాను ముందు ఒక భాగంగానే తీయాలనుకున్నారు. కానీ కథ పెద్దదైపోవడం.. అలాగే ఒక పార్ట్‌గా తీస్తే కమర్షియల్‌గా వయబుల్ కాదనిపించడంతో రాజమౌళి దాన్ని రెండు భాగాలు చేశాడు. ఐతే తొలి భాగానికి వచ్చిన అద్భుతమైన స్పందన తర్వాత రెండో భాగంపై అంచనాలు ఆకాశానికి చేరుకున్నాయి. ఆ సమయంలో అందరికీ ‘బాహుబలి-3’ మీద ఆశలు పుట్టాయి.
ఇంత విజయవంతమైన ఫ్రాంఛైజీని రెండో భాగంతోనే ఎందుకు ముగించాలి.. కథను పొడిగించి మూడో పార్ట్ కూడా తీస్తే బాగుంటుంది కదా అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ రాజమౌళి అలా చేయడానికి అంగీకరించలేదు. ఈ కథను ఇంకా సాగదీస్తే బాగోదన్నాడు. ‘ది కంక్లూజన్’తో బాహుబలి సిరీస్‌కు తెరదించాడు. బాహుబలి-3 గురించి అడిగితే.. ఆ ప్రపంచాన్ని కొనసాగిస్తూ ఆ తరహా సినిమా ఇంకోటి సినిమా తీస్తానేమో ‘బాహుబలి’ కథ మాత్రం ‘ది కంక్లూజన్’తో ముగిసిపోయినట్లే అని చెప్పాడు.
‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా లెవెల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ‘కేజీఎఫ్’ విషయంలోనూ ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. చాప్టర్-1కు అద్భుతమైన స్పందన రాగా.. సెకండ్ పార్ట్ మీద అంచనాలు మామూలుగా లేవు. ఐతే ఈ కథ ఇంతటితో ముగిసిపోతుందా.. ‘చాప్టర్-3’ కూడా ఉంటుందా అన్న సందేహాలు జనాల్లో ఉన్నాయి. ఐతే వాటికి దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరదించాడు.
‘కేజీఎఫ్’ ఫ్రాంఛైజీ సెకండ్ చాప్టర్‌తోనే ముగిసిపోతుందని చెప్పాడు. ఇంకో పార్ట్ తీయాలంటే కథను అనవసరంగా సాగదీసినట్లే అవుతుందని.. ఈ కథకు న్యాయం జరగదని ప్రశాంత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. తాను కథ విషయంలో అలా రాజీ పడలేనని అన్నాడు. తనకు కానీ, నిర్మాతలకు కూడా ‘కేజీఎఫ్’ను పొడిగించే ఉద్దేశాలు లేవని.. ‘కేజీఎఫ్’ తర్వాత తాను వేరే ప్రాజెక్టుల్లోకి వెళ్లిపోతున్నానని చెప్పాడు. రాకీ కేజీఎఫ్ సామ్రాజ్యాన్ని చేజిక్కించుకోవడంతో ‘కేజీఎఫ్ చాప్టర్-1’ ముగుస్తుంది. చాప్టర్-2లో అతడి ఆధిపత్యం.. అధీరాతో పోరు.. వ్యవస్థలకే సవాలుగా మారిన రాకీని ప్రభుత్వం లక్ష్యంగా చేసుకోవడం.. చివరికి అతడిని అంతమొందించడంతో కథ ముగుస్తుందని సమాచారం.
This post was last modified on December 23, 2020 6:52 pm
తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్‌ను కత్తితో దాడి…
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…