Movie News

తెలుగులో దురంధర్ ఊచకోత

దురంధర్ ది రివెంజ్ డబ్బింగ్ వెర్షన్లు ఎట్టకేలకు వాయిదాల మీద వాయిదాలు పడి రెండు రోజుల తర్వాత థియేటర్లలో షోలు మొదలుపెట్టాయి. నిన్నటిదాకా హిందీ వెర్షన్ తో సర్దుకున్నా ఇప్పుడు సీన్ మారిపోయింది. మాములుగా ఇలాంటి అనువాదం చేసిన రా అండ్ రస్టిక్ బాలీవుడ్ మూవీస్ కి ఏపీ తెలంగాణ బిసి సెంటర్లలో పెద్దగా ఆదరణ ఉండదు. కానీ దీనికి మాత్రం హైదరాబాద్ నుంచి అనంతపూర్ దాకా ప్రతి చోటా సోల్డ్ అవుట్ బోర్డులే కనిపిస్తున్నాయి.

బుక్ మై షో ఓపెన్ చేస్తే భాగ్యనగరంలో ఒక్క టికెట్ ముక్క లేదు. హిందీ కూడా ముందు వరసలో ఉన్న సీట్లు తప్ప అన్నీ అమ్ముడుపోయాయి. వీకెండ్ ఏదైనా కోరుకున్న థియేటర్ లో కావాలనుకున్న సీట్లో దురంధరే రివెంజ్ చూడాలంటే సాధ్యమయ్యేలా లేదు. ఒకపక్క ఉస్తాద్ భగత్ సింగ్ ఉన్నప్పటికీ మెజారిటీ ఆడియన్స్ ఛాయస్ దురంధర్ 2 అవుతోంది. స్క్రీన్లు పెంచాల్సిందిగా డిస్ట్రిబ్యూటర్ల మీద ఒత్తిడి వస్తున్నా ఏం చేయలేని పరిస్థితి నెలకొంది.

గతంలో యానిమల్, జవాన్, పఠాన్ లాంటివి డబ్బింగ్ వెర్షన్లు రిలీజయ్యాయి కానీ ఈ స్థాయిలో రాంపేజ్ అయితే చూపించలేదు. నమ్మలేని జోక్ ఏంటంటే ఆడియన్స్ లో కొందరు మొదటి భాగం చూడకపోయినా సీక్వెల్ కోసం పరుగులు పెడుతున్నారు. నాలుగు గంటల నిడివి ఉందని తెలిసీ ఇంతగా హిందీ సినిమాను ఓన్ చేసుకోవడం చూస్తే తెలుగు సినీ ప్రియుల అభిమానం మంచి కంటెంట్ మీద ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.

రాబోయే పది రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని బయ్యర్లు అంచనా వేస్తున్నారు. వచ్చే వారం యూత్, బ్యాండ్ మేళం లాంటి కొత్త రిలీజులు ఉన్నప్పటికీ వాటి మీద పెద్దగా అంచనాలు లేని దృష్ట్యా యునానిమస్ టాక్ తెచ్చుకుంటే తప్ప దురంధర్ తాకిడిని తట్టుకోలేవు. కొన్ని చోట్ల ఉస్తాద్ భగత్ సింగ్ రేట్లు కొంత తగ్గించారని అంటున్నారు. ఇది నిజమైతే అన్ని చోట్ల వీలైనంత త్వరగా అమలు చేయాలి. అప్పుడే దురంధర్ రివెంజ్ కాంపిటీషన్ ఎదురుకోవడం మరింత సులువవుతుంది.

This post was last modified on March 21, 2026 7:26 pm

Share

Recent Posts

ఇంతకీ అలియాస్ రుక్మిణి ఎవరు?

ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…

1 hour ago

కోన మీద కోపం తగ్గిందా?

కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…

1 hour ago

సామాజిక వ‌ర్గ రాజ‌కీయం క‌లిసొచ్చిందా జ‌గ‌న్‌… ?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఒక‌వైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచ‌న చేస్తామంటే కుదురుతుందా? అంటే కాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కానీ,…

2 hours ago

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

5 hours ago

ఇంకో వాయిదా అడగనున్న ఆదర్శం ?

అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…

5 hours ago

రణబాలికి కాంతార రంగు

ఒక కొత్త సినిమా ప్రోమో రాగానే దాన్ని గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలతో పోల్చడం ఆడియన్స్ కు అలవాటే.…

6 hours ago