జ్వరం వచ్చిన బాక్సాఫీసుకి దురంధర్ మందు

ఎక్కడ చూసినా దురంధర్ ది రివెంజ్ గురించిన చర్చలే జరుగుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో అత్యధిక శాతంలో ట్వీట్లు ఈ సినిమా గురించే ఉంటున్నాయి. కేవలం హిందీ వెర్షన్ తోనే రెండు రోజులు రాంపేజ్ ఆడిన ఈ బ్లాక్ బస్టర్ ఇవాళ్టి ఉంచి తెలుగుతో సహా ఇతర ప్రాంతీయ భాషల్లో డబ్బింగ్ తో పలకరించనుంది. సరిగ్గా వీకెండ్ ముందు ఇది జరగడంతో కలెక్షన్లు నెక్స్ట్ లెవెల్ కు వెళ్తాయని బయ్యర్ వర్గాలు ఆశిస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ దానికి తగ్గట్టే ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి పవన్ కళ్యాణ్ మూవీ పెట్టుకుని కూడా దురంధర్ ది రివెంజ్ ఇంత దూకుడు చూపించడం ఆశ్చర్యం కలిగించేదే. ఎప్పుడో డిడిఎల్, హమ్ ఆప్కె హై కౌన్, షోలే లాంటి హిందీ సినిమాలకు వారాల తరబడి హౌస్ ఫుల్స్ పడేవని, మళ్ళీ రెండు దశాబ్దాల తర్వాత హైదరాబాద్ లో ఆ స్థాయి రెస్పాన్స్ చూస్తున్నామని పంపిణీదారులు అంటున్నారు. ఇదే దూకుడు కనక పది రోజులు కొనసాగితే ఆల్ టైం రికార్డులు ఖాయం.

గత నెలన్నర రోజులుగా బాక్సాఫీస్ జ్వరంతో సతమతమవుతోంది. సంక్రాంతి సందడి అయిపోయాక ఏ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. ఒకటి రెండు హిట్లు ఉన్నప్పటికీ అన్ని సెంటర్లలో భారీ లాభాలు ఇచ్చిన బొమ్మలు లేవు. ఉస్తాద్ భగత్ సింగ్ కు మిక్స్డ్ రెస్పాన్స్ రావడం దురంధర్ రివెంజ్ కు కలిసి వస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా క్రమంగా దీనివైపే మొగ్గు చూపుతున్న వైనం ఏ కేంద్రాల్లో గమనించివచ్చు. ఆ స్థాయిలో కనెక్ట్ అయిపోయింది.

ఇది ఎక్కడిదాకా వెళ్తుందనేది ఇప్పటికిప్పుడు చెప్పలేం కానీ రణ్వీర్ సింగ్ మాత్రం అంత ఈజీగా నెమ్మదించేలా లేడు. ముఖ్యంగా తెలుగు వెర్షన్ కు ఎలాంటి స్పందన వస్తుందనే దాని మీద ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. దురంధర్ 3 ఎలాగూ లేదు కాబట్టి రెండో భాగాన్ని థియేటర్ ఎక్స్ పీరియన్స్ చేసే తీరాలనే పట్టుదల ఆడియన్స్ లో కనిపిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో మిడ్ నైట్ షోలకు సైతం హౌస్ ఫుల్స్ పడుతున్న వైనం దురంధర్ నెంబర్లను భారీగా పెంచుతోంది.