Political News

పోలవరం నిర్వాసితులకు పండగే పండగ.. 226 కోట్లు జమ!

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులు కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న పరిహారంలో కొంత మొత్తాన్ని తాజాగా సీఎం చంద్రబాబు స్వయంగా వారికి అందించారు. ఉగాది పండుగ సందర్భంగా వారిలో సంతోషం చూడాలన్న సంకల్పంతోనే ఈ నిధులు విడుదల చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ ముంపు గ్రామాల నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సాయంత్రం భేటీ అయ్యారు. పునరావాస పరిహార ప్యాకేజీ మూడో విడతలో భాగంగా నిర్వాసితులకు రూ.226 కోట్ల చెక్కును అందించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి అని, నదులు అనుసంధానం జరిగితే రాష్ట్రవ్యాప్తంగా ప్రయోజనం కలుగుతుందని అన్నారు. వైసీపీ హయాంలో నిర్వాసితులకు రూ.10 లక్షల చొప్పున ఇస్తామని చెప్పి వెనక్కి తగ్గారని విమర్శించారు. వరద నీటిలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా నిర్లక్ష్యంగా వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము వచ్చిన తర్వాత పోలవరం ప్రాంతాన్ని రంపచోడవరం నియోజకవర్గం కేంద్రంగా ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేశామని తెలిపారు. దీంతో ఇకపై పోలవరం అభివృద్ధి వేగంగా జరుగుతుందని చెప్పారు.

ప్రాజెక్టు నిర్వాసితులు రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ ఇళ్లను, భూములను త్యాగం చేశారని చంద్రబాబు అన్నారు. ఈ ఉగాది పండుగను పురస్కరించుకుని నిర్వాసితులు సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో వారి ఖాతాల్లో రూ.226 కోట్లు జమ చేస్తున్నామని తెలిపారు. వచ్చే ఉగాది తర్వాత రెండు నెలల్లోనే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని హామీ ఇచ్చారు. వైసీపీ పాలకుల నిర్లక్ష్యం కారణంగానే డయాఫ్రాం వాల్ దెబ్బతిందని పేర్కొన్నారు. నిపుణులతో అధ్యయనం చేయించి ఇప్పుడు కొత్త డయాఫ్రాం వాల్ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. వారం రోజుల్లో డయాఫ్రాం వాల్ నిర్మాణం పూర్తి అవుతుందని చెప్పారు.

కూటమి ప్రభుత్వం వచ్చిన 21 నెలల్లో ప్రాజెక్టు పనులు వేగవంతం చేశామని చంద్రబాబు తెలిపారు. 2025 జనవరిలో సంక్రాంతి సందర్భంగా మొదటి విడతగా నిర్వాసితులకు రూ.800 కోట్లు ఇచ్చామని, గత దీపావళికి రెండో విడతగా రూ.916 కోట్లను ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. ఇప్పుడు మూడో విడతగా ఉగాది సందర్భంగా రూ.226.6 కోట్లను చెల్లిస్తున్నామని తెలిపారు. ఈ 21 నెలల్లో 26,149 మంది నిర్వాసితులకు మొత్తం రూ.1943.53 కోట్లను చెల్లించామని వెల్లడించారు.

This post was last modified on March 19, 2026 11:04 pm

Share

Recent Posts

ఆస్కార్ వెళ్లేంత గొప్పగా ఉందా ‘గోంధల్’

ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…

2 hours ago

అవతార్ పోలికంటే అతిశయోక్తి అవుతుందేమో

నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…

2 hours ago

సాయిరెడ్డి వెంట న‌డిచే రెడ్లు ఉన్నారా?

పార్టీ ఏదైనా.. నాయ‌కుడు ఎవ‌రైనా సొంత సామాజిక వ‌ర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేక‌పోతే.. ప్ర‌జాబ‌లం అయినా…

2 hours ago

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

5 hours ago

షర్మిల కూతురి పెళ్ళికి జగన్ డుమ్మా ?

వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…

6 hours ago

ప్యారడైజ్ పోటీ నుండి తప్పుకున్న కీర్తి సురేష్

ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…

7 hours ago